Krishna Kanth | ప్రజల కోసం ఎన్నికల బరిలో విద్యావంతుడు

Krishna Kanth | మంథని, ఆంధ్రప్రభ : కత్తెర గుర్తుకు ఓటెయ్యాలని, కష్టాలు తీరుస్తానని యువ విద్యావంతుడు కొండా కృష్ణ కాంత్ ప్రజల్ని కోరుతున్నారు. మంథని మండలం కన్నాల గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల బరిలో యువ విద్యావంతుడు కొండ కృష్ణ కాంత్ బరిలో ఉన్నారు. కత్తెర గుర్తుకు ఓటేయాలని, కష్టాలు తీరుస్తానని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత గ్రామంలోని వెంకటేశ్వర స్వామి కమాన్ బస్ స్టాపు వద్ద నిర్మించడం కోసం కృషి చేస్తానని ఆయన తెలిపారు. వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దేవదాయ శాఖలో చేర్చుటకు కృషిచేయడమే కాకుండా ఆలయ కమిటీని పునరుద్ధరిస్తానని ఆయన పేర్కొన్నారు. సర్పంచ్ గా గెలిచిన తర్వాత యువత, మహిళల అభివృద్ధికి ప్రత్యేక కార్యక్రమాలు రూపొందిస్తానని ఆయన తెలిపారు. ప్రత్యేక హెల్ప్ లైన్ నెంబర్ ఏర్పాటు చేసి ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటానని ఆయన హితవు పలికారు. ప్రభుత్వ పథకాలు అర్హులకు అందేలా చేస్తానని ఆయన తెలిపారు. గ్రామాన్ని పరిశుభ్రంగా ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నం చేస్తానని, పక్షపాతం లేకుండా పారదర్శక పాలన అందిస్తానని, అందరికీ అందుబాటులో ఉంటానని ఆయన పేర్కొన్నారు.
