Welfare schemes | ఓటు వేసి గెలిపించండి.. అభివృద్ధి చేస్తాం…

Welfare schemes | ఓటు వేసి గెలిపించండి.. అభివృద్ధి చేస్తాం…

Welfare schemes | కడెం, ఆంధ్రప్రభ : ఉంగరం గుర్తుకు ఓటు వేసి తమను గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ బలపరుస్తున్న పెద్దూర్ జీపీ సర్పంచ్ అభ్యర్థి కొండాపురం లక్ష్మణ్ అన్నారు. ఈ రోజు కడెం మండలం పెద్దూర్ లంబడి తండా కోలం గూడెం గ్రామాలలో కడెం మండలం పెద్దూర్ జిపి సర్పంచ్ అభ్యర్థి కొండాపురం లక్ష్మణ్ పలు వీధుల గుండా పర్యటిస్తూ గడప గడపకు వెళ్లి ఓటర్లను, ప్రజలను కాంగ్రెస్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు(Welfare schemes) వివరించారు.

గతంలో తమ సతీమణి కొండాపురం అనూష చేసిన జీపీ అభివృద్ధి పనులను వివరిస్తూ తమ గుర్తు ఉంగరం గుర్తును చూపిస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈనెల11 న జరిగే ఎన్నికల్లో(elections) తమను గెలిపించుకోవాలని, తమను గెలిపిస్తే పెద్దూరు జీపీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పెద్దూర్ మాజీ సర్పంచ్ కే అనూష, కాంగ్రెస్ పార్టీ ఓటర్లు, ప్రజలు పాల్గొన్నారు.

Leave a Reply