పిడుగుపాటుకు ఎద్దు మృతి
పిడుగుపాటుకు ఎద్దు మృతి
జైనూర్, ఆంధ్రప్రభ : కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలంలోని జెండగూడ పంచాయతీలో ఉరుములు మెరుపులతో కురిసిన వర్షం వల్ల పిడుగు పడి పంచాయతీలోని లెండి జాల గ్రామానికి చెందిన ఆదివాసి గిరిజన రైతు కుమ్ర మాన్కుకు చెందిన ఎద్దు మృతి చెందినట్లు బాదిత రైతుతో పాటు జెండగూడ సర్పంచ్ ఉయిక చందన్ షావ్ శుక్రవారం తెలిపారు.
గురువారం రాత్రి మేతకు వెళ్ళి రాకపోవడంతో బాధిత రైతు ఎద్దు కోసం గాలించగా పిడుగుపాటుకు గురై మృతి చెంది కనిపించిందని వారు తెలిపారు. పిడుగుపాటు ఎద్దు మృతి చెందడంతో 50వేల విలువ యుద్ధం కోల్పోయినట్లు బాధిత రైతు ఆవేదనతో తెలిపారని సర్పంచ్ చందన్ షావ్ పేర్కొన్నారు. ప్రభుత్వం ఆ రైతుకు ఆదుకోవాలని ఆయన కోరారు.
