మున్సిపాలిటీ అభివృద్ధికి పాటుపడండి…

మున్సిపాలిటీ అభివృద్ధికి పాటుపడండి…

నంద్యాల గ్రేడ్ వన్ మున్సిపాలిటీ ప్రత్యేక అధికారిగా కలెక్టర్ బాధ్యతల స్వీకరణ..

నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : రాష్ట్ర ప్రభుత్వము రాష్ట్రంలోని 75 మున్సిపాలిటీలను 11 కార్పొరేషన్ల పాలకమండలి దరువు పూర్తి అవ్వటంతో నూతనంగా మున్సిపాలిటీలకు కార్పొరేషన్లకు ప్రత్యేక అధికారులను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఈ ఉత్తర్వుల మేరకు నంద్యాల గ్రేడ్ 1 మున్సిపాలిటీకి ప్రత్యేక అధికారిగా జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా శుక్రవారంబాధ్యతలు స్వీకరించారు.

మున్సిపల్ కమిషనర్ శేషన్నతో పాటు సంబంధిత శాఖల అధికారులు కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అధికారులకు సూచనలు సలహాలు ఇచ్చారు. మున్సిపాలిటీ పరిధిలో ప్రజలకు మెరుగైన సేవలు అందించడంపై, పారిశుద్ధ్యం, తాగునీరు, మౌలిక వసతుల అభివృద్ధి వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆమె సూచించారు. కార్యాలయానికి వచ్చే ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరించాలని సూచించారు.

ఏమాత్రం ఫిర్యాదులు అందిన సహించేది లేదని హెచ్చరించారు. నగర అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయడంతో పాటు ప్రజల సమస్యలను సమయానుకూలంగా పరిష్కరించేందుకు కృషి చేయాలని తెలిపారు. అధికారులు కూడా పట్టణ అభివృద్ధికి సహకరిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో మండల ఇంజనీర్ గుర్రప్ప యాదవ్, పట్టణ ప్రణాళిక అధికారులు తదితరు లు పాల్గొన్నారు.

Leave a Reply