7న మంగింపూడి బీచ్ లో యోగాంధ్ర కార్యక్రమం..
మచిలీపట్నం, ఆంధ్రప్రభ ; ఈనెల 7 వ తేదీన మంగినపూడి బీచ్ లో జరిగే యోగాంధ్ర కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, ప్రజలందరూ భాగస్వాములై విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ప్రకటనలో కోరారు.
రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈనెల 7 వ తేదీ నుండి 21వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా పలు యోగాంధ్ర కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ వివరించారు. ఇందులో భాగంగా ఈనెల 7 వ తేదీ ఆదివారం ఉదయం 6 గంటలకు మంగినపూడి బీచ్ లో యోగాంధ్ర కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు.
యోగాంధ్ర కార్యక్రమం నిర్వహణకు అన్ని ఏర్పాట్లు ముమ్మరంగా చేస్తున్నామని కలెక్టర్ తెలిపారు. అందులో ప్రజాప్రతినిధులు, ప్రజలు విరివిగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ కోరారు.
