కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులుగా సాయరెడ్డి నియామకం

మెండోరా, ఆంధ్రప్రభ : నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం మెండోరా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా బడల సాయరెడ్డి ను నియమిస్తున్నట్లు టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ప్రకటించారు. ఈ నియామకం పై నూతన అధ్యక్షుడు సాయరెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, బాల్కొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి సునీల్ కుమార్ ,జిల్లా అధ్యక్షుడు నగేశ్ రెడ్డి, మరియు మండల సీనియర్ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. సాయరెడ్డి నియామకం పట్ల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేశారు.

Leave a Reply