రూ.33 లక్షలతో హనుమాన్ ఆలయ నిర్మాణానికి భూమిపూజ

రూ.33 లక్షలతో హనుమాన్ ఆలయ నిర్మాణానికి భూమిపూజ

ఇచ్చోడ, ఆంధ్రప్రభ: సోనాల మండలంలోని పుల్సింగ్ నాయక్ తండా గ్రామంలో దేవాదాయ శాఖ నిధులతో రూ.33 లక్షల వ్యయంతో నిర్మించనున్న శ్రీ హనుమాన్ ఆలయ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే అనిల్ జాదవ్ భూమిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. భక్తులకు మెరుగైన ఆధ్యాత్మిక వాతావరణం కల్పించే దిశగా ఈ ఆలయ నిర్మాణం కీలకమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, అధికారులు, కార్యకర్తలు, గ్రామస్తులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.