12 ఏళ్ల బాలిక అత్యాచారం ఘటనపై
12 ఏళ్ల బాలిక అత్యాచారం ఘటనపై
మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ విచారం
ఖమ్మం ఆంధ్రప్రభ : ఖమ్మం నగరంలో 12 ఏళ్ల బాలికపై జరిగిన అత్యాచారం ఘటనపై మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ విచారం వ్యక్తం చేశారు. ఇటువంటి సంఘటనలు చైతన్యవంతమైన సమాజం ఉన్న ఖమ్మంలో జరగడం బాధాకరమని పువ్వాడ అన్నారు. బాధిత బాలిక తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులకు బీఆర్ఎస్ పార్టీ పక్షాన అండగా ఉంటామని తెలిపారు. బాలిక కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేసి ఆదుకోవాలని, నిందితుడిని అరెస్ట్ చేసి శిక్షించాలని డిమాండ్ చేశారు. ప్రజల భద్రత ప్రభుత్వం కర్తవ్యంగా ఉండాలని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సూచించారు.
