బాధిత కుటుంబానికి సీఎంఆర్‌ఎఫ్ ఎల్‌వోసీ అందజేత

మునుగోడు, ఆంధ్రప్రభ: నల్లగొండ జిల్లా మునుగోడు మండలం కొరటికల్ గ్రామానికి చెందిన బోడిశ సత్తయ్య అనారోగ్యంతో హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వైద్య ఖర్చుల నిమిత్తం సీఎం సహాయ నిధి నుంచి రూ.2.50 లక్షల ఎల్‌వోసీని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంజూరు చేయించారు.

ఈ ఎల్‌వోసీని కాంగ్రెస్ నాయకులు మందుల బీరప్ప, మురారిశెట్టి యాదయ్య, అద్దంకి సుమన్ ఈ రోజు సత్తయ్య కుటుంబ సభ్యులకు అందజేశారు. ఆర్థిక సహాయం అందేలా చర్యలు తీసుకున్న ఎమ్మెల్యేకు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.