Peddi Movie | అసలు సినిమాను మార్చేస్తున్న బుచ్చిబాబు.. జాన్వీ కపూర్ సీన్స్ కట్?
Peddi Movie | అసలు సినిమాను మార్చేస్తున్న బుచ్చిబాబు.. జాన్వీ కపూర్ సీన్స్ కట్?
Peddi Movie | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్: రామ్ చరణ్ హీరోగా, బుచ్చిబాబు దర్శకత్వంలో వచ్చిన ‘పెద్ది’ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డుల మోత మోగిస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికర వార్త చక్కర్లు కొడుతోంది. సాధారణంగా సినిమా రిలీజ్ అయ్యాక చిన్న చిన్న మార్పులు (సీన్స్ తొలగించడం) చేయడం చూస్తుంటాం. కానీ ‘పెద్ది’ టీం మాత్రం ఒక సరికొత్త సాహసానికి తెరలేపినట్లు తెలుస్తోంది.
ఇప్పటికే నడుస్తున్న వెర్షన్‌లో కొన్ని కీలక మార్పులు చేసి, సరికొత్త వెర్షన్‌ను ప్రేక్షకు ముందుకు తీసుకురావాలని చిత్రబృందం ఆలోచిస్తోందట.
జాన్వీ కపూర్ సీన్స్ డిలీట్?
ఫిలింనగర్ సమాచారం ప్రకారం.. ఇప్పటికే సెన్సార్ పూర్తి చేసుకుని థియేటర్లలో ఉన్న వెర్షన్ నుంచి హీరోయిన్ జాన్వీ కపూర్ సీన్స్‌తో పాటు మరికొన్ని అనవసరపు సన్నివేశాలను తొలగించబోతున్నట్లు టాక్. కథా గమనానికి అడ్డుపడుతున్నాయని భావించిన కొన్ని సీన్లను డిలీట్ చేసి, వాటి స్థానంలో మరికొన్ని కొత్త సీన్లను యాడ్ చేయాలని దర్శకుడు భావిస్తున్నారట.
చరణ్ – జగపతి బాబు మధ్య ఎమోషనల్ సీన్స్!
ముఖ్యంగా ఈ సినిమా సెకండాఫ్లో కొన్ని మార్పులు చేయబోతున్నారు. రామ్ చరణ్, సీనియర్ నటుడు జగపతి బాబు మధ్య సాగే పవర్‌ఫుల్ ఎమోషనల్ సీన్స్‌ను యాడ్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ ఎమోషనల్ డ్రామా సినిమాను మరో లెవెల్‌కు తీసుకెళ్తుందని చిత్ర యూనిట్ నమ్ముతోంది.
మళ్లీ సెన్సార్.. థియేటర్లలో కొత్త వెర్షన్!
ఈ మార్పులు చేర్పులన్నీ పూర్తి చేసిన తర్వాత, ఈ సరికొత్త వెర్షన్‌ను చిత్రబృందం మళ్లీ సెన్సార్ కి పంపించనుంది. సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తయిన వెంటనే థియేటర్లలో ఈ కొత్త వెర్షన్‌ను రీ-రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.
