Cattle-Fodder-Shortage : చెరువుల్లో నీళ్లు లేవు Andhra Prabha To[ Story

Cattle-Fodder-Shortage : చెరువుల్లో నీళ్లు లేవు Andhra Prabha To[ Story
- చేరువలో మేత లేదు
- కానరాని పచ్చిక బయళ్లు
- అటకపై సర్కారీ సబ్సిడీ
- పశుగ్రాసం కోసం పశువుల ఆక్రందన
( ఇల్లెందు , ఆంద్ర ప్రభ)
ఎండాకాలం మంటల్లో మానవాళి విలవిల్లాడుతుంటే.. ప్రకృతిలో జీవరాశులు, జంతుజలాలు తల్లడిల్లిపోతున్నాయి. ప్రకృతి లో సహజ సిద్ధంగా దొరికే ఆహారం ఎండాకాలం లోజాడలేకుండాపోగా , నీటి నిల్వలు అడుగంటి అన్ని జీవరాశుల జీవనంపై ప్రబావం చూపుతుంటే… .ఈ ఎండాకాలం లో తనను తాను కాపాడుకోవడానికి మనిషికి ఎన్నో సర్కస్ ఫీట్లు తప్పటం లేదు. నోరు లేని మూగ జీవాల పరిస్థితి ఏమిటి. అవి ఏమి చెప్పుకోలేవు, వాటిని అర్థం చేసుకొని మనమే వాటిని అన్నివిధాలచూసుకోవాలి. కానీ నేడు మనని, మనం రక్షించుకోవడానికే నానా తంటాలుపడుతున్నాం. పశువుల గురించి పట్టించుకునే పరిస్తితి ఉందా. ఒకనాడు పల్లె తాలుపాడిపంటలతో ప్రతి ఇల్లు కళ కళలాడేది. పశు పోషణ కోసం ప్రత్యేక శ్రద్ధ కనపరిచేవారు.పశు యజమానులు తమ పశువులను ఎండాకాలంలోసాకేందుకు ,పండించే వరి గడ్డి, జొన్న చొప్పు, కంది పొట్టు నిల్వలు చేసుకొని వేసవిలో ఉదయం సాయంత్రం ఆహారంగా అందించేవారు. అంతే కాదు పశువులు నీళ్ళు తాగేందుకు ప్రత్యేక తొట్లుఏర్పాటు చేసుకునేవారు. నాడుపశువులను తమతో సమానంగాచూసుకునేవారు. సమాజంమారింది, ఆధునిక పద్ధతులుపెరిగాయి. కరిగిపోతున్న కాలం తో పాటు పశు సంపద తరిగిపోయింది. వ్యవసాయంచేసుకోవడానికి నేడు పశువులతో పని లేకుండానే యంత్రాలు వినియోగంపెరిగిపోయింది. దుక్కి దున్నడానికి, సాలు వేయడానికి, విత్తనాలు నాటడానికి, కలుపు తీయడానికి ,చేతికివచ్చి న పంట కోయడానికి అన్ని యంత్రాలే. ఈ ప్రయాణం లో పశువుల మనుగడ కనుమరుగైంది. పంట చెలోనే పంటను విక్రయిస్తున్న నేడు, సాగు చేసిన పంట నుండి పశువుల మేత ను ఇంటికి తెచ్చి దాచుకునే స్థితి పూర్తిగా మారిపోయింది. ఈ కారణంగా అక్కడక్కడ కొంత మంది సాకుతున్న పశువులు ఎండాకాలం లో మేత ,నీళ్ల కోసం అల్లాడిపోతున్నాయి .ఎండల ప్రభావం కారణంగా చెరువుల్లో నీటి నిల్వలు ఇంకిపోగా, చెరువెనుక పచ్చిక కనుమరుగైంది. దీంతో పశువులు, గేదెలు మేత కోసం, నీళ్లకోసం అల్లాడిపోతున్నాయి
Cattle-Fodder-Shortage : ఇటు దాహం

వేసవిలో అధిక ఉష్ణోగ్రత కారణంగా వాతావరణంలో వచ్చే మార్పులు పశువులకు ప్రతికూలంగా మారుతాయి. నీ పరిస్థితుల్లో పశువులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం ఎంతో అవసరం.. ఆవుల కంటే గేదలు ఎక్కువ ఉష్ణతాపానికి గురవుతాయి. గేదెలు శరీరం నలుపు రంగులో ఉండటం, శరీరం కింద కొవ్వు భాగం ఎక్కువగా ఉండటం కారణంగా స్వేథ గ్రంధుల సంఖ్య తక్కువ కావడం కారణాల రీత్యా గేదెలు అధిక ఉష్ణోగ్రతనికి లోనవుతాయి.ఇవిఎండాకాలంలో మేతను తక్కువ తిని నీళ్లను ఎక్కువ తాగుతాయి. గేదెలశరీరాన్నిఎప్పటికప్పుడు నీటితో చల్లబర్చాల్సిన అవసరం ఎంతైనా అవసరం. వాతావరణ ఉష్ణోగ్రత గాలిలో తేమ అధికమైనప్పుడు పశువులు ఎక్కువగా వడదెబ్బకు లోన్ అవుతాయి. పశువులను గాలి ప్రసరణ సరిగ్గా లేని ప్రాంతాల్లో తక్కువ స్థలంలో ఎక్కువ పశువులను కిక్కిరిసి ఉంచినప్పుడు నీటి సౌకర్యం అందుబాటులో లేనప్పుడు పశువులు అధిక సమకూర్ లోను అవుతాయి ఇలాంటి సందర్భాల్లో వడదెబ్బ తాకిడికి గురైతే జాగ్రత్తలుతీసుకోవాల్సిన అవసరం ఉంది.
Cattle-Fodder-Shortage : అటు ఆకలి ..

ప్రభుత్వాలు కూడా మూగజీవుల పట్ల వివక్షత చూపుతున్నాయి. మనుషులు బ్రతకటానికి ఇన్ని అన్ని ఆహార నిల్వలు ఉండాలని, పదేపదే చెప్పుకుంటున్న మనం, పశువుల ఆహారాన్ని నిల్వ చేసుకోవాలని చెప్పడంలో ప్రభుత్వాలు పూర్తిగా విఫలం చెందాయి. పశువుల యజమానులు కూడా ఈ విషయాన్ని పూర్తిగా మర్చిపోయారు. అయినా ప్రభుత్వం విధి విధానాల్లో వేసవికాలంలో పశు పోషణ కోసం సబ్సిడీపై పశు దాణాను పంపిణీ చేసే ఆనవాయితీ గత కొన్నేళ్లుగా కొనసాగుతుండేది. ఇటీవల ఈ పథకాన్ని ప్రభుత్వం పూర్తిగా మర్చిపోయింది. పశు వైద్యశాల ద్వారా పశు గ్రాసాన్ని రైతులకు సగం ధరకే అందించే ప్రక్రియను పూర్తిగా నిలిపి వేశారు. దీంతో ఎండాకాలంలో పశుపోషణ, పశు యజమానులకు కష్ట సాధ్యంగా మారింది. నోరులేనిమూగజీవాలఅరణ్య రోదలను అర్థం చేసుకొని ప్రభుత్వం సబ్సిడీపై పశు గ్రాసం అందించాలని పశు యజమానులు డిమాండ్ చేస్తున్నారు.
