డిప్యూటీ సీఎంకు స్వాగతం పలికిన ఎంపీ కేశినేని చిన్ని
విజయవాడ అంబేద్కర్ కళావేదికలో ఏపీ హస్త కళా మహోత్సవం
డిప్యూటీ సీఎం పవన్ తో కలిసి కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ కేశినేని చిన్ని
కొండపల్లి బొమ్మల విశిష్టతను బ్రాండింగ్‌ను సైతం పెంచే దిశగా చర్యలు తీసుకోవాలని పవనుకోరిన ఎంపీ చిన్ని
విజయవాడ, ఆంధ్రప్రభ : విజయవాడ అంబేద్కర్ కళా వేదికలో ఏపీ హస్తకళ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొని ప్రారంభించారు. డిప్యూటీ సీఎం పవన్ కు విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని చిన్ని స్వాగతం పలికి పవన్ కళ్యాణ్ తో కలిసి కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసినటువంటి స్టాల్స్ అన్నిటిని డిప్యూటీ సీఎం పవన్, మంత్రి సవిత, ఎంపీ కేశినేని చిన్ని, ఆంధ్రప్రదేశ్ హస్తకళ నైపుణ్య అభివృద్ధి సంస్థ చైర్మన్ పసుపులేటి హరిప్రసాద్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా, పలువురు ఉన్నతాధికారులు కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా ఎంపి కేశినేని చిన్ని మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న లేపాక్షి హస్తకళ మహోత్సవం హస్తకళ ఎక్స్పో అత్యంత వైభవంగా ప్రారంభోత్సవం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేతుల మీదగా ప్రారంభించుకోవడం మంచి పరిణామం అని తెలిపారు లేపాక్షి అనేది ఒక సంస్థ మాత్రమే కాదు అది ఆంధ్రప్రదేశ్ హస్తకళల వారసత్వం సంస్కృతి సాంప్రదాయం కళాకారుల సృజనాత్మక ప్రతీకాని ఎంపీ చిన్ని తెలిపారు రాష్ట్రంలో వేలాదిమంది హస్తకళాకారుల జీవనోపాధికి బలమైన ఆధారంగా నిలుస్తున్న లేపాక్షిని ప్రపంచ స్థాయిలో మరింత ప్రతిష్టాత్మకంగా తీర్చిదిద్దడమే ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి లక్ష్యమని అన్నారు.

సంప్రదాయ హస్తకళలను పరిరక్షిస్తూనే ఆధునిక మార్కెట్ అవసరాలకు అనుగుణంగా వాటిని ప్రపంచవ్యాప్తంగా ప్రోత్సహించేందుకు అన్ని రకాల చర్యలు ఈ కూటమి ప్రభుత్వం చేపడుతుందని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ హస్తకళలు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు తీసుకురావడం లేపాక్షి బ్రాండ్ మరింత బలోపేతం చేయడం ఈ కామర్స్ వేదికల ద్వారా విక్రయాలు విస్తరించడం లక్ష్యంగా కార్యచరణ కొనసాగుతుందని తెలియజేశారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హస్తకళలను కళాకారులను ప్రోత్సహించే దిశగా ప్రభుత్వం నుంచి అన్ని రకాలుగా వారికి ప్రోత్సాహం అందించేందుకు అన్ని రకాల చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు భవిష్యత్తులో కళాకారులకు ఇంకా మెరుగైన సేవలు అందించే విధంగా కూటమి ప్రభుత్వం పని చేస్తుందని ఎంపీ చిన్ని తెలియజేశారు. కొండపల్లి హస్తకళల భౌగోళిక గుర్తింపును కాపాడుతూ నకిలీల నివారణ, అంతర్జాతీయ మార్కెటింగ్ కు అణువుగా వీటికి పార్లమెంట్ వేదికగా చర్చించి జియో టాకింగ్ సౌకర్యాన్ని సైతం తీసుకురావడం జరిగిందని ఎంపీ చిన్ని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రి సవిత ఎంపీ కేశినేని చిన్ని , ఆంధ్రప్రదేశ్ హస్తకళ నైపుణ్య అభివృద్ధి సంస్థ చైర్మన్ పసుపులేటి హరిప్రసాద్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశా పలువురు ఐఏఎస్ లు, పలు శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
