ప్రజలందరిపై అల్లా దైవం ఆశీస్సులు ఉండాలి…

ప్రజలందరిపై అల్లా దైవం ఆశీస్సులు ఉండాలి…

ఏపీ ఎస్.డబ్ల్యూ.సి చైర్మన్ రావి వెంకటేశ్వర రావు
రంజాన్ పర్వదిన వేడుకల్లో పాల్గొన్న…. రావి, వెనిగండ్ల నాని…కూటమి నాయకులు
ఆత్మీయ ఆలింగనం చేసుకుంటూ… ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు చెప్పిన కూటమి నాయకులు

గుడివాడ – ఆంధ్రప్రభ : సర్వ జనులపై అల్లా దైవం ఆశీస్సులు ఉండాలని ఏపీ ఎస్ డబ్ల్యూ సి చైర్మన్ రావి వెంకటేశ్వర రావు ఆకాంక్షించారు. ముస్లిం సోదరులకు కూటమి నాయకులు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.

గుడివాడ పట్టణంలో ఘనంగా జరిగిన రంజాన్ పర్వదిన వేడుకల్లో రావి, వెనిగండ్ల నాని,కూటమి నాయకులు శనివారం పాల్గొన్నారు. నైజాంపేటలోని నూర్ మసీద్, వన్ టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద గల గుల్జార్ చౌక్ తదితర మసీదుల వద్ద ప్రార్ధనలు ముగించుకున్న ముస్లిం సోదరులను ఆలింగణం చేసుకుంటూ, రావి వెంకటేశ్వరరావు, కూటమి నాయకులు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మైనార్టీ నాయకులు తమ సాంప్రదాయం ప్రకారం కూటమి నాయకులను సత్కరించి, కిర్ (పాయశం) అందించారు.

ఈ సందర్భంగా రావి మాట్లాడుతూ…. నెల రోజులపాటు కఠోర ఉపవాస దీక్షలను విజయవంతంగా ముగించుకున్న ముస్లిం సోదరులకు అభినందనలు తెలిపారు. సోదరులతో కలిసి రంజాన్ పర్వదిన వేడుకల్లో పాల్గొనడం సంతోషంగా ఉందని ఆయన హర్షం వ్యక్తం చేశారు. ముస్లిం సోదరులకు కూటమి నాయకులు రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు.

జనసేన ఇన్చార్జి బూరగడ్డ శ్రీకాంత్, గుడివాడ టిడిపి అధ్యక్షుడు దింట్యాల రాంబాబు, టీడీపీ నాయకులు పండ్రాజు సాంబయ్య, లింగం ప్రసాద్, చెకూరు జగన్మోహన్రావు, మైనార్టీ నాయకులు షేక్ ఇబ్రహీం, షేక్ జానీ, సయ్యద్ జబిన్, సయ్యద్ మున్వర్, మహమ్మద్ రఫీ, రబ్బాని, ఎండి ఇర్ఫాన్, ఎండి.అలీ, టీడీపీ నాయకులు అందుగుల యేసు పాదం, సింగవరపు ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.