Kavitha | పూజలు..

Kavitha | పూజలు..

Kavitha, బిక్కనూర్, ఆంధ్ర ప్రభ : కామారెడ్డి జిల్లా బిక్కానూరు మండల కేంద్రంలో ఉన్న పార్వతీ సిద్ధి రామేశ్వర ఆలయంలో శుక్రవారం తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు (Telangana jagruthi) కవిత ప్రత్యేక పూజలు చేయనున్నట్లు జిల్లా అధ్యక్షులు సంపత్ గౌడ్ తెలిపారు. జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా ఆమె ఆలయాన్ని సందర్శిస్తారని చెప్పారు. ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ప్రజా సమస్యలను తెలుసుకుంటారని.. కవిత పర్యటనను ప్రజలు విజయవంతం చేయాలని కోరారు.

Leave a Reply