రైతులను మోసం చేస్తూ అధిక డబ్బులు వసూలు

రైతులను మోసం చేస్తూ అధిక డబ్బులు వసూలు
గన్ని సంచుల పేరుతో హమాలీల పేరుతో వసూలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలి
కొనుగోలు వేగవంతం చేపట్టండి
లారీల కొరతతో రైతుల నుండి డబ్బులు వసూలు
తాసిల్దార్ ఆడే కమల్ సింగ్ కు వినతిపత్రం అందజేస్తున్న రైతులు
నిర్మల్ జిల్లా కుంటాల, ఆంధ్రప్రభ : ఆరుగలం కష్టపడి పండించిన రైతులకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చిందని కోరుతూ గురువారం కుంటాల మండల కేంద్రంలోని తాసిల్దార్ ఆడే కమల్ సింగ్ కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గన్ని సంచుల పేరుతో లారీలు మరియు అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నారని వినతిపత్రంలో కోరారు కుంటాల సొసైటీ ఆధ్వర్యంలో మొక్కజొన్న కొనుగోలు గన్ని బ్యాగుల కొరత తీవ్రంగా ఉందని దీంతో ధాన్యం కొనుగోలను వేగవంతం చేపట్టాలని ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు రాత్రి పగలు కల్లాలపై కాపలా కాస్తున్నామని ప్రభుత్వం నిర్లక్ష్యం మూలంగా గన్నిసంచుల కొరత, మరోపక్క లారీల కొరతతో రైతుల నుండి సంబంధిత సొసైటీ అధికారులు గన్నిసంచుల కోసం, లారీల కోసం డబ్బులు వసూళ్లు చేస్తున్నారని వారు పేర్కొన్నారు.
క్రమశిక్షణ పద్ధతుల కొనుగోలు చేయకుండా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నిర్వాహకులు ఇష్ట రాజ్యాంగ వివరిస్తూ తమ అనుకున్న వారికి కొనుగోలు చేపడుతున్నారని కాంటాలు చేస్తున్నారని మండిపడ్డారు హామాలి చార్జీలు కూడా అధికంగా వాళ్ళు వసూలు చేస్తున్నారని వినతిపత్రంలో పేర్కొన్నారు. అదేవిధంగా లారీల కృతతో ఒక బస్తాకు 30 రూపాయల్లో చొప్పున డబ్బులు వసూలు చేస్తున్నారని ప్రైవేటు కాటాలతో దుకాణం చేయిస్తున్నారని సమగ్ర విచారణ చేపట్టి రైతులకు న్యాయం చేయాలని లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని రైతులు హెచ్చరించారు. రైతుల నుండి నిలుపు దోపిడి చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు రైతులు తదితరులు పాల్గొన్నారు.
