దేశవాళీ మ్యాచ్ లకు కడప స్టేడియం సిద్ధం

దేశవాళీ మ్యాచ్ లకు కడప స్టేడియం సిద్ధం

ఏపీఎల్ వేదికగా అభివృద్ధి చేసిన పనులను వర్చువల్ గా ప్రారంభించిన ఏసీ అధ్యక్షుడు కేశినేని శివనాథ్ సెక్రటరీ సానా సతీష్

విజయవాడ, ఆంధ్రప్రభ : కడప( వైయస్ రాజారెడ్డి స్టేడియం) కడప వేదికగా ఐదు రోజులపాటు క్రికెట్ పండుగ జరుగుతున్న నేపథ్యంలో ఇప్పటివరకు కడపలో జరిగిన మ్యాచ్ లన్ని ఒక ఎత్తైతే నేటి నుంచి గ్రౌండ్కు ఒక ప్రత్యేక హోదా రానుంది ఇప్పటికే (ఏ పీ ఎల్) ఆంధ్ర ప్రీమియర్ లీగ్ లాంటి ప్రతిష్టాత్మకమైన లీగ్ను కడప లాంటి ఒక మంచి వేదికలో నిర్వహించడం కోసం ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కసరత్తును ప్రారంభించి ఎట్టకేలకు మ్యాచ్లు నిర్వహణ వరకు తీసుకువచ్చింది. ఇందులో కృషి చేసిన ప్రతి ఒక్కరికి అధ్యక్ష కార్యదర్శులు శుభాకాంక్షలు తెలిపారు ముఖ్యంగా స్టేడియం అభివృద్ధికి కడప క్రికెట్ అసోసియేషన్, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కమిటీ మెంబర్ భరత్ రెడ్డి స్టేడియం చైర్మన్ అందరూ కలిసికట్టుగా పని చేశారని తెలిపారు. నేటి నుంచి ఏపీఎల్ మ్యాచ్లు కడప వేదికగా జరుగుతుండగా ఇప్పటికే గ్రౌండ్ను అన్ని విధాల రెడీ చేస్తూ కావాల్సిన వసతులన్నీ సిద్ధం చేశారు దీనికి సంబంధించిన ప్రారంభోత్సవం నేడు వర్చువల్ గా అధ్యక్షుడు కేశినేని శివనాద్ సెక్రటరీ సన సతీష్ ప్రారంభించారు. ఒక మంచి గ్రౌండ్ కు ఇలా అన్ని విధాల సౌకర్యాలు రావడం చాలా సంతోషంగా ఉందని త్వరలో దేశవాళీ మ్యాచ్లకు సైతం కడప ఆతిథ్యం ఇవ్వాలని అన్ని విధాల పూర్తి సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి కూడా అధ్యక్ష కార్యదర్శులు శుభాకాంక్షలు తెలిపారు స్టేడియం ను నూతనంగా రెన్యువెట్ చేస్తూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను అభివృద్ధి చేస్తూ మెరుగైన మ్యాచులు నిర్వహిస్తూ ఒక మంచి గ్రౌండ్ గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పెట్టుకుని అధ్యక్ష కార్యదర్శులు పనిచేస్తున్నారని ఏసీఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కమిటీ మెంబర్ భరత్ రెడ్డి తెలియచేశారు ఇలాంటి ప్రతిష్టాత్మకమైన లీగ్ కడపలో నిర్వహించినందుకు ముందుగా అధ్యక్ష కార్యదర్శులకు ధన్యవాదాలు తెలిపారు రాబోయే రోజుల్లో మరింతగా సౌకర్యాలు పెంచి మరిన్ని మ్యాచులు కడప స్టేడియంలో జరిగే విధంగా చూస్తామని భరత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ట్రెజరర్ శ్రీనివాస్, సి ఓ ఓ గిరీష్ డోంగ్రి , సీఏఓ జై కిషన్, ఏసీ ఏ గేమ్ డెవలప్మెంట్ మేనేజర్ ఎమ్మెస్ కుమార్ కడప క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ముని కుమార్ రెడ్డి సెక్రటరీ రెడ్డి ప్రసాద్, స్టేడియం కమిటీ చైర్మన్ శ్రవణ్ కుమార్ రెడ్డి, కన్వీనర్ సంజయ్ కుమార్ రెడ్డి, ఏసిఏ సిబ్బంది పాల్గొన్నారు.