​ప్రేమ విఫలమై యువకుడు ఆత్మహత్య

​ప్రేమ విఫలమై యువకుడు ఆత్మహత్య

​దండేపల్లి, ఆంధ్రప్రభ: ప్రేమ విఫలమై మనస్తాపంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన దండేపల్లి మండలంలో చోటుచేసుకుంది.​దండేపల్లి ఎస్సై గుడేటి రాజవర్ధన్, కుటుంబ సభ్యులు తెలిసిన వివరాల ప్రకారం.. నెల్కివెంకాపూర్ గ్రామానికి చెందిన బమ్మెన సుమంత్ (23) అనే యువకుడు, గత కొంతకాలంగా ఓ గ్రామానికి చెందిన ఒక యువతిని ప్రేమించాడు.

అయితే, ఆ యువతి తన ప్రేమను తిరస్కరించడంతో సుమంత్ తీవ్ర మనస్తాపానికి చెంది బుధవారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో గదిలోకి వెళ్లి తలుపులు వేసుకుని చీరతో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే స్థానికుల సహాయంతో అతడిని కిందకు దించి చూడగా, అప్పటికే మృతి చెందినట్లు గుర్తించారు. సుమంత్ తల్లి బమ్మెన సత్తెమ్మ,ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్లు ఎస్సై రాజవర్ధన్ తెలిపారు.