బండి సంజయ్ ప్రజా జీవితంలో నిండు నూరేళ్లు కొనసాగాలి

  • శ్రీకాంత్ యాదవ్

ఎల్కతుర్తి, ఆంధ్రప్రభ: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ జన్మదినాన్ని పురస్కరించుకుని బీజేపీ మండల అధ్యక్షుడు శ్రీకాంత్ యాదవ్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బండి సంజయ్ నిండు నూరేళ్లు ప్రజా జీవితంలో కొనసాగుతూ ప్రజాసేవ చేయాలని ఆకాంక్షించారు. ఆయన నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ మరింత అభివృద్ధి సాధించాలని కోరారు. బండి సంజయ్ సారథ్యంలో రానున్న రోజుల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందనే విశ్వాసాన్ని శ్రీకాంత్ యాదవ్ వ్యక్తం చేశారు.