సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ
పాయకాపురం, ఆంధ్రప్రభ: ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్ఎఫ్)ని పారదర్శకంగా అర్హులైన పేదలకు అందజేస్తున్నామని విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బొండా ఉమామహేశ్వరరావు తెలిపారు.
శుక్రవారం సెంట్రల్ ఎమ్మెల్యే కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని 25, 27 డివిజన్లకు చెందిన 24 మంది లబ్ధిదారులకు మొత్తం రూ.10,06,070 విలువైన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను ఆయన పంపిణీ చేశారు.
అనారోగ్యంతో బాధపడుతూ వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందిన పేద కుటుంబాలకు ఈ ఆర్థిక సాయం అందజేసినట్లు బొండా ఉమా తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం సంక్షేమ పథకాల ఫలాలు అందేలా కృషి చేస్తున్నామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో సెంట్రల్ నియోజకవర్గ కోఆర్డినేటర్, 27వ డివిజన్ ఇన్చార్జి నవనీతం సాంబశివరావు, మాజీ కార్పొరేటర్ వీరమాచినేని లలిత, 25వ డివిజన్ అధ్యక్షుడు మాచర్ల గోపి, మాచర్ల పావని, 27వ డివిజన్ అధ్యక్షుడు దాసరి జయరాజు, మల్లంపల్లి సురేష్, మద్దాల రుక్మిణి, కొండపల్లి రూప్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
