Jangaon | నామినేషన్ల స్వీకరణ కేంద్రాన్ని సందర్శించిన డీసీపీ

Jangaon | నామినేషన్ల స్వీకరణ కేంద్రాన్ని సందర్శించిన డీసీపీ

Jangaon | రఘునాథపల్లి, ఆంధ్రప్రభ : తొలి దశ గ్రామపంచాయతీ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల స్వీకరణ (nominations Reception) కార్యక్రమం గురువారం నుంచి ప్రారంభం కావడంతో శుక్రవారం జనగామ డీసీపీ రాజమహేంద్ర నాయక్ ( Rajamahendra Nayak) రఘునాథపల్లి మండల కేంద్రంతో పాటు కంచనపల్లి గ్రామంలో నామినేషన్ల స్వీకరణ కేంద్రాన్ని సందర్శించారు.

ఈసందర్బంగా డీసీపీ (DCP) నామినేషన్ల స్వీకరణ కార్యక్రమాన్ని సజావుగా నిర్వహించేందుకు పోలీస్ బందోబస్తు ఏర్పాట్లపై సంబంధించిన పోలీస్ అధికారులకు అడిగి తెలుసుకున్నారు. నామినేషన్ల స్వీకరణ (nominations Reception) సంబంధించి రెవెన్యూ, పోలీసు అధికారులు సిబ్బంది, అభ్యర్థులు పాటించాల్సిన నిబంధనలపై పలు సూచనలు చేయడంతో పాటు, స్వీకరణ కేంద్రాల్లో భద్రతాపరంగా పోలీసులు పగడ్బంధీగా ఏర్పాటు చేసుకోవాల్సిందిగా అధికారులు ఆదేశించారు. ఈకార్యక్రమంలో ఎస్ఐ డి. నరేష్, పోలీస్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply