Janajagruti | కవిత వ్యూహం ఏమిటో?

Janajagruti | కవిత వ్యూహం ఏమిటో?
Janajagruti | వెబ్ డెస్క్ అంధ్రప్రభ : జనజాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వ్యూహం ఏమిటో అనేది ప్రస్తుత చర్చనీయాంశంగా ఉంది. కల్వకుంట్ల కవిత (kalvakuntla kavitha) పరిచయం చేయని ఓ మహిళ. ఉద్యమ, రాజకీయ నాయకురాలు. బతుకమ్మ పండగకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకువచ్చిన ఓ తెలంగాణ ఆడపడుచు కూడా! తెలంగాణ ఉద్యమం నుంచి ఇప్పటి వరకూ ప్రజల మధ్య ఉంటున్న ఆమె భవిత రాజకీయ వ్యూహంపై అన్ని పార్టీలతో పాటు అన్ని వర్గాల ప్రజలు చర్చించుకుంటున్నారు.

Janajagruti కేసీఆర్ బాటలో ప్రస్థానం
తండ్రి, బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ఉద్యమంలో చేరారు కవిత. తెలంగాణ ఉద్యమం తీవ్రతరం అవుతున్న సమయంలో సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా ప్రజలలో చైతన్యం కల్పించాలన్న ఉద్దేశంతో 2006లో జాగృతి సంస్థ ఏర్పాటు చేశారు. జాగృతి సంస్థ ఆధ్వర్యంలో బతుకమ్మ పండగను వెలుగులోకి తీసుకువచ్చారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత బతుకమ్మ పండగను అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తేవడంలో కవిత కీలకపాత్ర వహించారు కూడా. నిజామాబాద్ నుంచి ఒకసారి ఎంపీగా, రెండు సార్లు ఎమ్మెల్సీగా (MLC) ఎన్నికయ్యారు. ఎమ్మెల్యేల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. కవిత కార్మిక సంఘాలలో చురుకైన పాత్ర పోషించారు. తెలంగాణ రాష్ట్ర విద్యుత్ కార్మిక సంఘం గౌరవ అధ్యక్షురాలుగా, తెలంగాణ అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షురాలుగా కూడా ఉన్నారు.

Janajagruti ప్రజలతో మమేకమవుతూ…
అన్నిరంగాల్లో చురుకైన పాత్ర పోషించిన కవిత తాను ఎంతో ఆరాధించిన తండ్రికి, కుటుంబ సభ్యులకు, అలాగే బీఆర్ఎస్ (BRS) పార్టీకి దూరమైంది. బీఆర్ఎస్ నుంచి దూరమైనప్పటి నుంచి ప్రజలతో మమేకమవుతున్నారు. ప్రజాసమస్యలపై పోరాటం చేస్తున్నారు. గత ప్రభుత్వం చేసిన పొరపాట్లు, అలాగే ప్రస్తుత ప్రభుత్వం చేసిన తప్పులను ఎత్తి చూపుతున్నారు. ప్రజల్లో కూడా కవిత లేవనెత్తిన అంశాలు కూడా చర్చకు దారి తీస్తున్నాయి. అటు బీఆర్ఎస్ పార్టీలో ఉన్న కొందరి వ్యవహశైలిపై గట్టిగా గళం విప్పుతున్న ఆమె వ్యూహంపై కూడా చర్చ జరుగుతుంది. ఆమె వ్యూహం కూడా ఎవరికీ అంతుపట్టడం లేదు.

Janajagruti జనాదరణ ఉన్నా…
రెండోసారి జరిగిన తెలంగాణ ఉద్యమంలో పాలుపంచుకుని, ఓ రాజకీయ నాయకురాలుగా వెలుగొందే వారిలో కల్వకుంట్ల కవిత రెండోవారు. మొదట వరుసలో సినీనటి విజయశాంతి (Vijayashanthi) ఉన్నారు. తెలంగాణ ఉద్యమ నేతగా, ఒక పార్టీని ఏర్పాటు చేసిన ఆమె మళ్లీ ఆ పార్టీని విలీనం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. సినీనటి విజయశాంతి రాజకీయంగా రాణించలేకపోయి జాతీయ పార్టీలో చేరారు. తెలంగాణ ప్రజలు ఆదరించడం వేరు.. రాజకీయంగా మద్దతు ఇవ్వడం వేరు.. అయితే కల్వకుంట్ల కవిత కూడా రాజకీయ పార్టీ తో ఎన్నికల్లోకి వెళితే ఏమి జరుగుతుందో వేచి చూడాలి.

