పరిటాల సునీతకు భారీ గజమాల సన్మానం…

పరిటాల సునీతకు భారీ గజమాల సన్మానం…

రామగిరిలో వేడుకల్లో సందడి

రామగిరి, ఆంధ్రప్రభ : రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత జన్మదినాన్ని పురస్కరించుకుని రామగిరిలోని టీడీపీ కార్యాలయం వద్ద ధర్మవరం నియోజకవర్గ పరిటాల అభిమానులు ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమెకు భారీ గజమాల వేసి సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ వేణుగోపాల్ రెడ్డి, ధర్మవరం మార్కెట్ యార్డ్ డైరెక్టర్ చిగిచెర్ల రాఘవరెడ్డి పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ, ప్రజాసేవలో పరిటాల సునీత చేస్తున్న కృషి ఆదర్శనీయమని కొనియాడారు. మహిళల అభివృద్ధి, పేద ప్రజల సంక్షేమం కోసం ఆమె నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు.

ప్రజలతో మమేకమై వారి సమస్యల పరిష్కారానికి ఎప్పుడూ ముందుండే నాయకురాలిగా పరిటాల సునీత గుర్తింపు పొందారని అభిమానులు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ధర్మవరం నియోజకవర్గానికి చెందిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply