అంబరాన్నంటిన జగదీష్ రెడ్డి జన్మదిన వేడుకలు..

గులాబీమయమైన సూర్యాపేట

ప్రత్యేక పూజలు.. అన్నదానాలు.. రక్తదాన శిబిరాలు.. సేవా కార్యక్రమాలతో ఘనంగా సంబరాలు

సూర్యాపేట, ఆంధ్రప్రభ : మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి జన్మదిన వేడుకలను బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు సూర్యాపేట నియోజకవర్గం వ్యాప్తంగా శనివారం ఘనంగా నిర్వహించారు. ప్రత్యేక పూజలు, కేక్ కటింగ్‌లు, రక్తదాన శిబిరాలు, అన్నదానాలు, పండ్ల పంపిణీ, సామాజిక సేవా కార్యక్రమాలతో వేడుకలు సందడిగా సాగాయి. పట్టణం అంతా ఫ్లెక్సీలు, కటౌట్లు, తోరణాలతో గులాబీమయంగా మారింది.

సూర్యాపేట పట్టణంలో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు సవరాల సత్యనారాయణ ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మాజీ కౌన్సిలర్ నిమ్మల స్రవంతి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో మాజీ మంత్రి పీఏ ప్రభాకర్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి వై. వెంకటేశ్వర్లుతో కలిసి కొత్త బస్టాండ్ ఫ్లైఓవర్ వద్ద అల్పాహారం, పండ్ల పంపిణీ చేశారు.

మాజీ కౌన్సిలర్ కళ్లేపల్లి మహేశ్వరి దశరథ ఆధ్వర్యంలో వాణిజ్య భవన్ చౌరస్తాలో అల్పాహార పంపిణీ నిర్వహించారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో భారీ కేక్ కట్ చేశారు. మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ ఆధ్వర్యంలో ఏరియా ఆస్పత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ చేయగా, 9వ వార్డులో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి కేక్ కట్ చేసి అన్నదానం నిర్వహించారు.

27వ వార్డులో కక్కిరేణి నాగయ్య ఆధ్వర్యంలో తాళ్లగడ్డలో కేక్ కట్ చేయగా, గద్దల విజయశేఖర్ ఆధ్వర్యంలో 35వ వార్డులోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు షూలు పంపిణీ చేసి భోజనం ఏర్పాటు చేశారు. ఖమ్మం చౌరస్తాలో కేక్ కట్ చేశారు.

సవరాల సత్యనారాయణ ఆధ్వర్యంలో కొత్త బస్టాండ్ ఫ్లైఓవర్ కింద, అలాగే స్వామి వివేకానంద ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. పల్స వెంకన్న ఆధ్వర్యంలో కాసరాబాద్ అపూర్వ బధిరుల పాఠశాలలో అన్నదానం చేపట్టగా, దుర్గం ప్రభాకర్ ఆధ్వర్యంలో కేసారం చర్చిలో దుస్తుల పంపిణీ, ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి, చార్లెట్ అనాథాశ్రమంలో నోట్‌బుక్స్ పంపిణీ చేశారు.

కూరగాయల మార్కెట్‌లో కాల్ రామ్ ఆధ్వర్యంలో బాణాసంచా పేల్చి వ్యాపారులతో కలిసి కేక్ కట్ చేశారు. కోర్టు చౌరస్తాలో న్యాయవాదులు కేక్ కట్ చేసి గోవులకు పండ్లు పంపిణీ చేశారు.

పెన్‌పహాడ్ మండలంలో త్రికుటేశ్వర స్వామి ఆలయంలో మాజీ మంత్రి పీఏ ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎంపీపీ నెమ్మది బిక్షం ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం చెక్‌డ్యామ్ వద్ద రైతులతో కలిసి కేక్ కట్ చేశారు. మండల అధ్యక్షుడు దొంగరి యుగేందర్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించగా, గ్రామాల్లో కేక్ కటింగ్‌లు జరిగాయి.

సూర్యాపేట మండలంలోని యండ్లపల్లి సీతారామచంద్రస్వామి ఆలయంలో మాజీ జడ్పీటీసీ జీడి బిక్షం, మండల అధ్యక్షుడు వంగాల శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి గ్రామాల్లో వేడుకలు జరిపారు.

ఆత్మకూర్ (ఎస్) మండలంలోని నెమ్మికల్ గ్రామంలో దండు మైసమ్మ ఆలయంలో మాజీ జడ్పీ వైస్ చైర్మన్ గోపగాని వెంకట్ నారాయణ గౌడ్, మండల అధ్యక్షుడు తూడి నరసింహారావు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి కేక్ కట్ చేశారు.

చివ్వెంల మండలంలో మండల అధ్యక్షుడు జూలకంటి జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో అన్ని గ్రామాల్లో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు కేక్ కటింగ్‌లు, బాణాసంచా పేలుళ్లు నిర్వహిస్తూ జగదీష్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.