మోదీ సారధ్యంలోనే ప్రజాప్రగతి………
ఆలేరు, ఆంధ్రప్రభ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర బీజేపీ ప్రభుత్వం గత పదేళ్లుగా దేశవ్యాప్తంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందని యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండల బీజేపీ కార్యదర్శి బైరి మహేందర్ గౌడ్ తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ, తెలంగాణలో హైదరాబాద్‌ను గ్లోబల్ ఇన్నోవేషన్ హబ్‌గా అభివృద్ధి చేయడం, జాతీయ రహదారుల విస్తరణ, రైల్వే ప్రాజెక్టులు, మెట్రో విస్తరణ, సాంకేతిక మరియు రక్షణ రంగాల మౌలిక వసతుల అభివృద్ధికి ప్రధాని మోదీ స్వయంగా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. తెలంగాణ అభివృద్ధి పట్ల బీజేపీ అంకితభావంతో పనిచేస్తోందనే విషయానికి ఈ కార్యక్రమాలే నిదర్శనమని పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడటం ఖాయమని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
