చిట్యాలలో మొక్కలు నాటిన బీజేపీ నాయకులు..

చిట్యాల, ఆంధ్రప్రభ : భారత ప్రధాని నరేంద్ర మోదీ ముందుచూపుతో భావితరాలకు మంచి పర్యావరణాన్ని అందించే లక్ష్యంతో దేశవ్యాప్తంగా మొక్కలు నాటాలని ఇచ్చిన పిలుపు అభినందనీయమని చిట్యాల పట్టణ బీజేపీ నాయకులు తెలిపారు.

ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధాని పిలుపు మేరకు చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని 7వ వార్డులో గల పాటిమీద ఆంజనేయ స్వామి ఆలయం వద్ద మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా బీజేపీ పట్టణ అధ్యక్షులు గుండాల నరేష్ గౌడ్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. చెట్ల పెంపకం ద్వారా భావితరాలకు శుభ్రమైన వాతావరణం అందించవచ్చని ఆయన అన్నారు.

ఈ కార్యక్రమంలో పట్టణ ప్రధాన కార్యదర్శి చుంచు శ్రీను, జిల్లా కౌన్సిల్ సభ్యుడు కురేళ్ళ శ్రీనివాస్, జయరాపు రామకృష్ణ, గంజి గోవర్ధన్, మాజీ జిల్లా కార్యదర్శి బోడిగే అశోక్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply