వీవర్స్ సొసైటీ చైర్మన్ గా సంపత్ కుమార్ ఎన్నిక,
చిట్యాల, ఆంధ్రప్రభ : మండలంలోని చల్లగరిగలో నినవార్ హ్యాండ్లూమ్స్ వీవర్స్ కో-ఆప రేటివ్ ప్రొడక్షన్ అండ్ సేల్స్ సొసైటీ లిమిటెడ్ పాలకవర్గ ఎన్నికలు గురువారం రాత్రి నిర్వహించారు. జిల్లా సహకా ర శాఖ ఆధ్వర్యంలో ఎన్నికల అధికారి ఎం,రాణి, శ్రీలక్ష్మి సీ నియర్ ఇన్స్పెక్టర్, జిల్లా సహ కార కార్యాలయం, హనుమ కొండ పర్యవేక్షణలో కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. చైర్మన్ గా మెరుగు సంపత్ కుమార్, ఉపాధ్య క్షుడు మెరు గు సమ్మయ్య, కార్యదర్శి సా మల రాజేందర్ ,కోశాధికారి దుబాసి నర్సయ్యలను ఎన్ను కున్నారు.ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన చైర్మన్ మెరుగు సంపత్ కుమార్ మాట్లాడుతూ, సొసైటీ అభి వృద్ధి, చేనేత కార్మికుల సంక్షే మం ఆర్థికాభివృద్ధి కోసం పా రదర్శకంగా కృషి చేస్తానని తెలిపారు.
