ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 సీజన్‌లో లక్నో తరఫున ఆడుతున్న యువ ఆటగాడు దిగ్వేష్ రాఠిపై బీసీసీ మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ యువ ఆటగాడు బౌలింగ్‌లో బాగా రాణిస్తున్నాడు. అయితే, వికెట్ తీసుకున్నప్పుడు జరుపుకునే సంబరాలపై బీసీసీఐ ఇప్పటికే పలుమార్లు మండిపడింది.
ఇది అతడికి మొదటి సీజన్ అయినప్పటికీ ఇప్పటికే బీసీసీఐ రెండుసార్లు జరిమానా విధించింది. అయినప్పటికీ, అదే దూకుడు ప్రవర్తనతో మరోసారి ఇబ్బందుల్లో పడ్డాడు ఈ రైసింగ్ స్టార్.
నిన్న (సోమవారం) ఎకానా స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో… దిగ్వేష్ రాఠికి భారీ జరిమానా ఎదుర్కున్నాడు. ఈ మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్ ఆటగాడు అభిషేక్ శర్మను అవుట్ చేసిన తర్వాత, దిగ్వేష్ నోట్‌బుక్‌తో సంబరాలు చేసుకున్నాడు.
దీంతో అభిషేక్ – దిగ్వేష్ మధ్య వాగ్వాదం జరిగింది. ఆటగాళ్లు, అంపైర్లు జోక్యం చేసుకోవడంతో గొడవ సద్దుమణిగింది. అభిషేక్ పెవిలియన్‌కు వెళ్లాడు.
ఈ సీజన్‌లో దిగ్వేష్ ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించడం ఇది మూడోసారి… దీంతో అతని మ్యాచ్ ఫీజులో 50 శాతం జరిమానా విధించారు. దాంతోపాటు, దిగ్వేష్‌పై ఒక మ్యాచ్ సస్పెషన్‌కు గురి అయ్యాడు. ఫలితంగా, మే 22 గురువారం గుజరాత్ టైటాన్స్‌తో లక్నోలో జరిగే మ్యాచ్‌లో అతను ఆడడు.
అభిషేక్‌కూ జరిమానా..
మరోవైపు ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు సన్‌రైజర్స్ ప్లేయర్ అభిషేక్ శర్మకు మ్యాచ్ ఫీజులో 25 శాతం జరిమానా విధించారు. అతనికి ఒక డీమెరిట్ పాయింట్ కూడా ఇవ్వబడింది. ఈ సీజన్‌లో అభిషేక్ ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించడం ఇదే మొదటిసారి.