ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా నేడు (మంగళవారం) అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా రాజస్థాన్ రాయల్స్ – చెన్నై సూపర్ కింగ్స్ తలపడనున్నాయి. ఇప్పటికే రెండు జట్లు నిష్క్రమించడంతో, నేటి మ్యాచ్ రెండు జట్ల మధ్య నామమాత్ర పోరుగా మారింది. అయితే, ఎప్పటిలాగే ఎంఎస్ ధోని అభిమానులు ఈ మ్యాచ్ కోసం ఎదురుచూస్తున్నారు.
కాగా, ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన రాజస్థాన్ బౌలింగ్ ఎంచుకుని చెన్నైని ముందుగా బ్యాటింగ్ కు ఆహ్వానించింది.