ఎమ్మెల్యే దంపతులకు ఆహ్వానం..

మునుగోడు, ఆంధ్రప్రభ : మే 1 నుండి 4వ తారీఖు వరకు నల్లగొండ జిల్లా మునుగోడు మండలం కిష్టాపురం గ్రామంలో అత్యంత వైభవంగా నిర్వహించనున్న శ్రీ రేణుక ఎల్లమ్మ,నాభిశీల ప్రతిష్ట మహోత్సవానికి ముఖ్య అతిథులుగా విచ్చేయాలని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి దంపతులను ఆలయ కమిటీ సభ్యులు వారి నివాసంలో ఈరోజు కలసి ఆహ్వానించారు.ఈ సందర్భంగా మహోత్సవ ఏర్పాట్ల వివరాలను ఎమ్మెల్యే దంపతులకు వివరించారు.
గ్రామ ప్రజల ఆధ్యాత్మిక విశ్వాసాలకు ప్రతీకగా నిలిచే ఈ మహోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ ఆహ్వాన కార్యక్రమంలో మునుగోడు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు భీమనపల్లి సైదులు, సర్పంచ్ మాలుగు శ్రీను, మాజీ జెడ్పీటీసీ జాజుల అంజయ్య గౌడ్, దేవాలయ చైర్మన్ మునుకుంట్ల మల్లయ్య గౌడ్,నందిపాటి రాధారమేష్, దేవాలయ మాజీ చైర్మన్ బోయ గాలయ్య,సురిగి రాఘవులు,పంతంగి పరమేష్,మునుకుంట్ల శివ,బోయ కృష్ణ,నజీర్ బాబా తదితరులు పాల్గొన్నారు.
