Police | ఇంతలోనే పెళ్లి కొడుకు…

Police | ఇంతలోనే పెళ్లి కొడుకు…
Police | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : మహబూబ్‌నగర్ జిల్లా ధన్వాడ మండలంలో పెళ్లి సందడి నెలకొనాల్సిన ఇంట్లో విషాదం అలుముకుంది. బుధవారం పెళ్లి జరగాల్సి ఉండగా, సోమవారం అర్ధరాత్రి వరుడు రాజోలి మల్లేష్ (21) చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.
పెళ్లికూతురును తీసుకురావడానికి ఇంట్లో ఏర్పాట్లు జరుగుతున్న సమయంలోనే ఈ విషాదం చోటుచేసుకోవడం మరింత కలచివేసింది. మల్లేష్ ఆత్మహత్యకు పాల్పడటంతో పెళ్లి ఇంట్లో ఒక్కసారిగా శోకసంద్రం నెలకొంది.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదని, కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేపడుతున్నామని పోలీసులు తెలిపారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది.
