ఆటో డ్రైవర్ కుమార్తెకు ఇంటర్‌లో అద్భుత విజయం…

ఆటో డ్రైవర్ కుమార్తెకు ఇంటర్‌లో అద్భుత విజయం…

కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : కర్నూలు నగరానికి చెందిన ఓ ఆటో డ్రైవర్ కుటుంబంలో పుట్టిన విద్యార్థిని ఎడిదా రాణి తన ప్రతిభతో మెరిసింది. ఇంటర్మీడియట్ ఫలితాల్లో బైపీసీ విభాగంలో 986 మార్కులు సాధించి కళాశాల టాపర్‌గా నిలిచి అందరి ప్రశంసలు అందుకుంది. ప్రభుత్వ జూనియర్ (బి.క్యాంపు) కళాశాలలో చదువుతున్న రాణి, సాధారణ కుటుంబ నేపథ్యాన్ని అధిగమించి ఈ విజయాన్ని సాధించడం విశేషం.

ఈ సందర్భంగా కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ… తన తల్లిదండ్రులు చదువుకోలేకపోయినా చదువుపై చూపిన ఆసక్తి, ప్రోత్సాహమే తనకు ప్రేరణగా నిలిచిందని తెలిపింది. తనకు మార్గదర్శకులైన లెక్చరర్లకు కృతజ్ఞతలు తెలుపుతూ, ప్రభుత్వ కళాశాలలో చదివి మంచి మార్కులు సాధించడం ఆనందంగా ఉందని రాణి పేర్కొంది.

కష్టపడి చదివితే ఏ పరిస్థితుల్లోనైనా విజయాన్ని సాధించవచ్చని ఆమె తన సహ విద్యార్థులకు సందేశం ఇచ్చింది. రాణి సాధించిన ఈ విజయంపై కళాశాల అధ్యాపకులు, సహ విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తూ ఆమె భవిష్యత్తు మరింత ఉత్సాహంగాల ఉండాలని ఆకాంక్షించారు.

Leave a Reply