ఇంద్రకీలాద్రి అరుణ శోభితం…

ఇంద్రకీలాద్రి అరుణ శోభితం…
- తండోప తండాలుగా భవానీల రాక
- పర్యవేక్షణలో ఈవో, చైర్మన్ గాంధీ బిజీబిజీ
ఎన్టీఆర్ బ్యూరో, ఆంధ్రప్రభ : జై భవాని… జై జై దుర్గా భవాని… నామస్మరణతో ఇంద్రగిరలు(Indragiral) పులకరిస్తున్నాయి. రాష్ట్రం నలుమూలల నుంచి భారీ సంఖ్యలో తరలివస్తున్నభవానీBhavani)ల రాకతో ఇంద్రకీలాద్రి ఇరుపెక్కుతోంది. అరుణ శోభితంగా మారిన ఇంద్రకీలాద్రి(Indrakiladri)పై అమ్మవారి శరణు ఘోష మార్మోగుతోంది. గంట గంటకు పెరుగుతున్నభవానీల రాకతో అన్నిక్యూలైన్లతో పాటు హోల్డింగ్ ఏరియాలో కూడా కిక్కిరిసి ఉన్నాయి. జగన్మాత దర్శనానికి సుమారు ఐదు గంటలకు పైగా సమయం పడుతున్నప్పటికీ భక్తిశ్రద్ధలతో అమ్మవారి దర్శనం కోసం క్యూలైన్లో ఎదురుచూస్తున్నభవానీలు అమ్మ నామస్మరణను జపిస్తున్నారు.
పుణ్యస్నానాలు ఆచరించి…
భవాని దీక్షను స్వీకరించిన భవానీలు పవిత్ర కృష్ణానది తీరాన అధికారులు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఘాట్ల వద్ద జల్లు స్నానాలు ఆచరిస్తున్నారు. కొంతమంది భక్తులు అమ్మవారికి తలనీలాలను సమర్పించి పుణ్యస్నానాలు ఆచరించిన అనంతరం హోల్డింగ్ ఏరియా(Holding Area)తో పాటు కెనాల్ రోడ్‌లోని వినాయకుడి గుడి వద్ద ప్రారంభమవుతున్నద్వారా అమ్మ దర్శనానికి అమ్మ నామస్మరణను జపిస్తూ బయలుదేరుతున్నారు.
రాష్ట్రం నలుమూలల నుండి పెద్ద ఎత్తున తరలివస్తున్నభవానీలు రైలు బస్సుల ద్వారా ఉత్తరాంధ్ర నుండి తల్లిలాగా పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి నుండి చాలామంది భవానీలు కాలినడకన ఇంద్రకీలాద్రికి వస్తున్నారు. లక్షల సంఖ్యలో తరలివచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసిన అధికారులు(Officials) క్యూలైన్లో భవానీలకు అవసరమైన తాగునీరు, మజ్జిగ, బిస్కెట్లను పంపిణీ చేస్తున్నారు.
ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ వారి దర్శనానంతరం భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలను చేసి, శివాలయం మెట్ల మార్గం ద్వారా కిందకు చేరుకుంటున్నభవానీలు అక్కడే ఏర్పాటు చేసిన అన్నప్రసాదాన్ని స్వీకరిస్తున్నారు. అలాగే భవానీలు పెద్ద ఎత్తున లడ్డు ప్రసాదాన్ని సైతం కొనుగోలు చేస్తున్నారు.
సౌకర్యాలను పర్యవేక్షిస్తున్నఈఓ, చైర్మన్ గాంధీ..
ఇంద్రకీలాద్రికి లక్షల సంఖ్యలో తరలివస్తున్నభవానీల కోసం చేసిన ఏర్పాట్లను వారికి అందుతున్నసౌకర్యాలను క్షేత్రస్థాయిలో శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం కార్యనిర్వాహణ అధికారి శీనా నాయక్, నూతన చైర్మన్ బొర్రా రాధాకృష్ణ(Radhakrishna) (గాంధీ)లు క్షేత్రస్థాయిలో స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. శుక్రవారం క్యూలైన్లతో పాటు భవానీలు వేచి ఉన్న ప్రాంతాలలో పర్యటిస్తూ వారికి అందుతున్న సౌకర్యాలు, కావలసిన మౌలిక వసతులపై ఆరా తీస్తున్నారు.
అలాగే వారి అభిప్రాయాలను సేకరిస్తున్నవీరు అన్నదాన భవనంలో అన్న ప్రసాదం స్వీకరిస్తున్నభవానీలతో మాట్లాడి నాణ్యతను అడిగి తెలుసుకుంటున్నారు. ఎప్పటికప్పుడు లడ్డూలను సైతం అందుబాటులో ఉంచే క్రమంలో అధికారులను అప్రమత్తం చేస్తున్నవీరు క్యూలైన్లలో భవానీలు ఎక్కువసేపు నిలవకుండా శీఘ్ర దర్శనం కలిగేలా రద్దీని నియంత్రించేందుకు చర్యలు చేపట్టారు.



