మంత్రి సహకారంతో అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు..
ఊట్కూర్, ఆంధ్రప్రభ ; మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి సహకారంతో అర్హులైన నిరుపేదలందరికీఇందిరమ్మఇండ్లు మంజూరు చేయడంతో పాటు గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని మల్లేపల్లి సర్పంచ్ సత్యారం కథలప్పఅన్నారు. శుక్రవారం నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల పరిధిలోని మల్లెపల్లి లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ వేసవికాలంలో గ్రామంలో నీటి ఎద్దడి విద్యుత్ సమస్య తదితకుండా తలెత్తకుండా నిరంతరం ప్రజల మధ్య ఉంటూ సేవ చేస్తాననిఅన్నారు.
మంత్రి వాకిటి శ్రీహరిసహకారంతో ఎన్నో ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న బ్రిడ్జి నిర్మాణం కోసం నిధులు మంజూరు చేసి పనులు ప్రారంభించినట్లు తెలిపారు. గ్రామంలో నెలకొన్న వివిధ సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తామని అన్నారు. గ్రామంలోని ప్రతి కాలనీలో సిసి రోడ్లు డ్రైనేజీలు ఏర్పాటు చేస్తామని ఇండ్లు మంజూరైన లబ్ధిదారులు నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేసుకోవాలన్నారు.మల్లేపల్లి గ్రామానికి మొదటి విడత 12 ఇండ్లు మంజూరు కాగా రెండో విడత ఐదు ఇండ్లు మంజూరు కాగా లబ్ధిదారులు నిర్మాణ పనులు చేపడుతున్నారనిఅన్నారు.
