బాబాపూర్‌లో ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశం

బాబాపూర్‌లో ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశం
భీమ్‌గల్ రూరల్, ఆంధ్రప్రభ:
నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం భీమ్‌గల్ మండలంలోని బాబాపూర్ గ్రామంలో సోమవారం నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమం నిర్వహించారు.
బాల్కొండ నియోజకవర్గ ఇన్‌చార్జి ముత్యాల సునీల్ కుమార్ ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ ఎం.ఏ. సమీర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. లబ్ధిదారితో కలిసి రిబ్బన్ కట్ చేసి ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ సమీర్ మాట్లాడుతూ, ప్రజా ప్రభుత్వం అర్హులైన ప్రతి లబ్ధిదారుడి సొంతింటి కలను నెరవేర్చాలనే సంకల్పంతో ముందుకు సాగడం అభినందనీయమన్నారు. ఇందిరమ్మ ఇళ్ల ద్వారా పేద కుటుంబాల కళ్లలో ఆనందం కనిపిస్తోందని తెలిపారు.
ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారు షబ్బీర్ మాట్లాడుతూ, సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని ప్రజా ప్రభుత్వం పేదలను గుర్తించి ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇవ్వడం సంతోషకరమన్నారు. పాలకవర్గ సభ్యులు, బాల్కొండ నియోజకవర్గ ఇన్‌చార్జి ముత్యాల సునీల్ కుమార్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ గోవర్ధన్, పంచాయతీ కార్యదర్శి సంతోష్, కారోబార్ ఇమ్రాన్, ఇందిరమ్మ కమిటీ సభ్యులు అజర్, నదీమ్, ఉపాధ్యక్షుడు నవీద్, పాలకవర్గ సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
