ఐదవ రోజుకు చేరిన ఐకెపి వివోఏల నిరవధిక సమ్మె..

వర్ని, ఆంధ్రప్రభ : వర్ని మండల కేంద్రంలో ఐకేపీ (IKP) వీవోఏల నిరవధిక సమ్మె శుక్రవారం నాటికి ఐదో రోజుకు చేరుకుంది. తమ సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన ఆందోళనను ప్రభుత్వం స్పందించే వరకు కొనసాగిస్తామని వారు స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా వీవోఏలు పలు డిమాండ్లను ప్రభుత్వ దృష్టికి తీసుకువచ్చారు. వీవోఏలకు కనీస వేతనం రూ.26 వేలుగా నిర్ణయించాలని, పని భారం తగ్గించాలని, అర్హులైన వీవోఏలకు సీసీలుగా పదోన్నతులు కల్పించాలని కోరారు.

అలాగే జీఓ నెం.58ను సవరించాలని, వీవోఏలకు సాధారణ మరియు ఆరోగ్య బీమా సౌకర్యాన్ని రూ.20 లక్షల వరకు కల్పించాలని డిమాండ్ చేశారు.

తమ న్యాయమైన డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని కోరిన వీవోఏలు, సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె కొనసాగుతుందని హెచ్చరించారు. ఈ సమ్మెలో ఐకేపీ వీవోఏలు, సంఘ నాయకులు మరియు సభ్యులు పాల్గొన్నారు.