Incident | నర్సాపూర్ కు చెందిన వారిగా గుర్తింపు

Incident | నర్సాపూర్ కు చెందిన వారిగా గుర్తింపు
Incident | వర్గల్, ఆంధ్రప్రభ : స్నేహితుడి పెళ్లికి హాజరై దైవ దర్శనానికి వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో పడి చనిపోయిన సంఘటన గురువారం వర్గల్ మండలం నాచారం లో వెలుగు చూసింది. సంఘటనకు సంబంధించి గౌరారం ఎస్సై జే ఆరోగ్యం తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మెదక్ జిల్లా నర్సాపూర్ కి చెందిన ఎర్రగుళ్ల ప్రశాంత్ 27 కిచెర వికాస్ 27 బుధవారం రోజున తూప్రాన్ లో స్నేహితుని పెళ్లికి హాజరై సాయంత్రం నాచారం దేవస్థానానికి వెళ్తున్నామని తోటి స్నేహితులకు చెప్పారు.

నాచారం చేరిన తర్వాత అక్కడ గల గోశాల వెనుక ఉన్న హల్దీ వాగులో స్నానం చేయడానికి దిగుతుండగా ప్రమాదవశాత్తు కాలుజారి అందులో పడిపోయారు. దీంతో వారికి ఈత రాకపోవడంతో ఊపిరాడక నీటిలో మునిగి చనిపోయారు. కాగా గురువారం ఉదయం నీటి పైన ముగ్గురి మృతదేహాలు తేలుతూ ఉండటం గమనించినట్లు ఈ మేరకు మృతుడు ఎర్రగుల్ల ప్రశాంత్ తండ్రి రాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.



CLICK HERE TO READ MORE : Interrogation | రూ.1.20 కోట్లు స్వాధీనం.. ఏడుగురు అరెస్ట్
