8 posts | ప్రత్యేక నియామక ప్రక్రియలో ఆసక్తికర ఘటన

8 posts | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్: యెస్…మీరు కరెక్ట్ గానే చదివారు.
ఎందుకంటే పదుల సంఖ్యలో ఉద్యోగాలు, వందల్లో అభ్యర్థులు, లేదా వందల్లో ఉద్యోగాలు, వేలల్లో దరఖాస్తులు, క్యూలో ఇంటర్వ్యూకి అభ్యర్థులు…ఇలాంటి వార్తలే మనకు తెల్సు …కానీ, ఏకంగా 8 ఉద్యోగాలు.. ఇంటర్వ్యూకు ఒక్కరే హాజరవడం, ఉద్యోగం కూడా ఆమెకే ఇవ్వడం…వినడానికి వింతగా ఉన్నా ఇది జరిగిందెక్కడో తెలుసా?

మధ్యప్రదేశ్‌లోని సీధీ జిల్లాలో గిరిజన సంక్షేమం కోసం చేపట్టిన ప్రత్యేక నియామక ప్రక్రియలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. బైగా, భారియా, సహారియా గిరిజన తెగలకు చెందిన అభ్యర్థుల కోసం అటవీ రక్షకుల (ఫారెస్ట్ గార్డ్) నియామకానికి మొత్తం 8 పోస్టులను ప్రభుత్వం మంజూరు చేసింది.

ఈ నియామకాలకు రాష్ట్రవ్యాప్తంగా కేవలం 25 దరఖాస్తులు మాత్రమే అందాయి. అనంతరం నిర్వహించిన ఎంపిక ప్రక్రియకు ఒక్క మహిళా అభ్యర్థి మాత్రమే హాజరయ్యారు. అర్హత ప్రమాణాలను పూర్తిచేసిన ఆమెను అధికారులు ఎంపిక చేశారు.

మిగిలిన పోస్టులు ఖాళీగానే ఉండగా, గిరిజన ప్రాంతాల్లో అవగాహన లోపం, అర్హులైన అభ్యర్థులు తక్కువగా ఉండటం వంటి కారణాల వల్ల దరఖాస్తులు ఆశించిన స్థాయిలో రాలేదని అధికారులు భావిస్తున్నారు. ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.