HYD | లారీని ఢీకొట్టిన కారు

HYD | లారీని ఢీకొట్టిన కారు

ఒక‌రు మృతి.. మ‌రొక‌రికి తీవ్ర గాయాలు

HYD | ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : హైదరాబాద్ నగరంలోని రాజేంద్రనగర్ ఔటర్ రింగ్ రోడ్డుపై లారీని అతివేగంగా కారు ఢీకొన‌డంతో ఒక‌రు మృతిచెంద‌గా.. మరో వ్య‌క్తికి తీవ్ర గాయాలయ్యాయి. శంషాబాద్ వైపు నుంచి గచ్చిబౌలి వైపు వెళ్తున్న ఔటర్ రింగ్ రోడ్డుపై ఈ ఘటన చోటుచేసుకుంది. అతివేగంగా వెళ్తూ లారీని కారు ఢీకొట్ట‌డంతో కర్మన్‌ఘాట్‌కు చెందిన వెంకట సాయిరామ్(35) మృతి చెందాడు. ప్రమాదంలో మరో వ్యక్తికి తీవ్ర గాయాలు కావ‌డంతో ఆస్పత్రికి తరలించారు.

Leave a Reply