Crime | ప్రతీకార హత్య….?

Crime | ప్రతీకార హత్య….?
- గుర్తుతెలియని వ్యక్తి కేసులో పురోగతి
Nalgonda | సూర్యాపేట రూరల్, ఆంధ్రప్రభ : సూర్యాపేట రూరల్ పోలీస్ స్టేషన్(Police Station) పరిధిలోని టేకుమట్ల నుండి ఖమ్మం వెళ్లే జాతీయ రహదారి వెంట పిల్లలమర్రి శివారులో శనివారం తెల్లవారుజామున గుర్తు తెలియని మృతదేహం లభ్యమయింది. సమాచారం అందుకున్న రూరల్ పోలీసులు(Rural Police) సంఘటన స్థలాన్ని పరిశీలించారు. సంఘటన స్థలంలో ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో అక్కడికి చేరుకున్న జిల్లా ఎస్పీ కేసును వేగంగా చేదించేందుకు రెండు బృందాలను ఏర్పాటు చేశారు.
ఆయన ఆదేశాల మేరకు కేసు నమోదు చేసిన రూరల్ పోలీసులు శనివారం సాయంత్రం వరకే కేసులో పురోగతి సాధించినట్లు తెలిసింది. హైదరాబాద్(Hyderabad)కు చెందిన వ్యక్తి ఆయన భార్యను హతమార్చగా భార్య తరపు కుటుంబ సభ్యులు ప్రతీకారం తీర్చుకునేందుకు హత్య చేసినట్లు విశ్వసనీయ సమాచారం.
