Devotees | కిలోమీట‌ర్ల మేర క్యూ

Devotees | కిలోమీట‌ర్ల మేర క్యూ

బాట గంగమ్మ ఆలయం వరకు వేచి ఉన్న భక్తులు
నిన్న శ్రీవారిని దర్శించుకున్న 77,864 మంది భక్తులు
నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.33 కోట్లు
నిన్న శ్రీవారికి తలనీలాలు సమర్పించిన 39,348 మంది భక్తులు

Devotees | ఆంధ్ర‌ప్ర‌భ వెబ్ డెస్క్ : తిరుమల కొండ భక్తులతో కిట‌కిట‌లాడుతోంది. ఆదివారం కావడంతో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్ మెంట్లు భక్తులతో నిండిపోయాయి. శ్రీవారి సర్వదర్శనానికి బాట గంగమ్మ ఆలయం వరకు భక్తులు వేచి ఉన్నారు. ఈరోజు టోకెన్లులేని భక్తులకు సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు ఆరు నుంచి ఏడు గంటల సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లను కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం నాలుగు నుంచి ఐదు గంటల సమయం పడుతుంది. నిన్న శ్రీవారిని 77,864 మంది భక్తులు దర్శించుకున్నారు. నిన్న శ్రీవారికి తలనీలాలను 39,348 మంది భక్తులు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.33 కోట్లు వచ్చిందని అధికారులు తెలిపారు.

తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య నానాటికీ పెరుగుతుండటంతో తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు భక్తులు అందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. క్యూ లైన్ లో ఉన్న భక్తులకు శ్రీవారి సేవకులు మజ్జిగ, అన్న ప్రసాదం, పాలు, మంచినీటిని పంపిణీ చేస్తున్నారు. చిన్న పిల్లలు ఇబ్బందులు పడకుండా అవసరమైన చర్యలు తీసుకున్నారు.

Leave a Reply