HYD | ఐపీఎల్‌లో ఇవాళ డబుల్ హెడర్

HYD | ఐపీఎల్‌లో ఇవాళ డబుల్ హెడర్
ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : ఐపీఎల్ 2026లో భాగంగా ఇవాళ (ఆదివారం) రెండు డబుల్ హెడర్ మ్యాచ్‌లు జరగనున్నాయి. మధ్యాహ్నం 3:30 గంటలకు కోల్‌కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడనున్నాయి. అలాగే రాత్రి 7:30 గంటలకు రెండో లక్నో సూపర్ జెయింట్స్, పంజాబ్ కింగ్స్ జట్లు ఢీకొననున్నాయి. ఈ మ్యాచ్‌లు Star Sports లో ప్రసారమవుతాయి మరియు JioHotstar లో లైవ్ స్ట్రీమింగ్ చూడవచ్చు.
ఇప్పటి వరకూ విజయాల ఖాతా తెరవని కోల్‌కతా నేడు రాజస్థాన్‌ను ఢీకొట్టనుంది. ఇక అగ్రస్థానంపై కన్నేసిన పంజాబ్ రెండో మ్యాచ్‌లో లఖ్‌నవూతో తలపడనుంది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ఓటమితో రగులుతోన్న రాజస్థాన్ రాయల్స్‌ను ఇంకా విజయాల ఖాతా తెరవని కోల్‌కతా నైట్‌రైడర్స్ ఎలా ఎదుర్కొంటుందో చూడాలి. గత మ్యాచ్‌లో విఫలమైన సున్నాకే వెనుదిరిగిన వైభవ్ ఈ మ్యాచులో ఎలా ఆడాతాడో చూడాలి. ఇరు జట్ల మధ్య 30 మ్యాచులు జరగగా.. కేకేఆర్ 16 మ్యాచులు గెలిచింది . ఆర్ ఆర్ 14 మ్యాచుల్లో గెలిచింది.
పంజాబ్ కింగ్స్ వరుస విజయాలతో దూసుకుపోతోంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. ఐదు మ్యాచుల్లో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. నాలుగు విజయాలు సాధించింది. మరొక మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. మరోవైపు లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ పరిస్థితి రెండు అడుగులు ముందుకు.. మూడు అడుగులు వెనక్కి అనేలా ఉంది. ప్రస్తుతం 4 పాయింట్లతో ఎనిమిదో స్థానంలో ఉన్న లఖ్‌నవూ ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే ప్రతి మ్యాచ్‌లోనూ విజయం సాధించాల్సిందే. ఇరు జట్లూ ఐపీఎల్‌లో 6 సార్లు తలపడగా.. చెరో మూడేసి మ్యాచుల్లో విజయం సాధించాయి. ఈసారి ఎవరు ఆధిపత్యం ప్రదర్శిస్తారనేది చూడాలి.
