HYD| వైభవంగా చివరి సోమవారం కార్తీక పూజ పూజ‌లు..

HYD| వైభవంగా చివరి సోమవారం కార్తీక పూజ పూజ‌లు..

కంటోన్మెంట్, ఆంధ్రప్రభ : తార్బంద్‌ శ్రీ భవాని శివలింగేశ్వర స్వామి దేవాలయంలో కార్తీకమాసం చివరి సోమవారం ప్రత్యేక పూజలు భక్తిశ్రద్ధల మధ్య వైభవంగా జరిగాయి. కాలనీ, బస్తీ ప్రాంతాల నుండి భారీ సంఖ్యలో భక్తులు విశేషంగా తరలివచ్చి స్వామివారికి అభిషేకం, అర్చనలు, హారతులు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.

ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో స్వామి వారి భక్తులు, ఆలయ కమిటీ ప్రతినిధులు కంటోన్మెంటు బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు సాదా కేశవరెడ్డి, కణిత దంపతులు, శివారెడ్డి, లలితమ్మ, గాలి పల్లి దుర్గయ్య అంజి గౌడ్, స్వరూప రాణి అనురాధ, ప్రకాష లు స్వామివారిని పూలమాలతో అలంకరించి పూజలకు వైభవంగా ఏర్పాట్లు చేశారు.

ఈ ప్రత్యేక పూజలో స్థానిక భక్తులతో పాటు పెద్ద సంఖ్యలో మహిళా భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు పరంకుశపాని భక్తులకు హారతిని ఇచ్చి ఆ ఆశీర్వచనాలు అందజేశారు. అనంతరం ఆలయ ట్రస్ట్ సాదా కేశవరెడ్డి కనిత దంపతులు భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు.

ఈ సందర్భంగా సాదా కేశవరెడ్డి దంపతులు మాట్లాడుతూ… ఆలయంలో ప్రతి సోమవారం ప్రత్యేక పూజలు ఏర్పాటు చేసి భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకుగాను అన్ని విధాలుగా ఏర్పాట్లు చేశామని, ప్రతి సంవత్సరం కార్తీకమాసం అంతా స్వామివారికి అభిషేకాలు అర్చనలతో ప్రత్యేక పూజలు నిర్వహించడం ఆలయంలో ఆనవాయితీగా వస్తుందని అందులో భాగంగానే చివరి సోమవారం ప్రత్యేక పూజలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

Leave a Reply