180 మంది విద్యార్థులు పోటీపడగా..గెలిచింది వీరే…

180 మంది విద్యార్థులు పోటీపడగా..గెలిచింది వీరే…
CBSE జాతీయ పోటీలలో బిర్లా ఓపెన్ మైండ్స్ ఇంటర్నేషనల్ స్కూల్ రజత పతకం గెలుపు!
పంజాబ్‌లోని GCM కాన్వెంట్ పాఠశాల లో జరిగిన CBSE జాతీయ స్థాయి ఆర్చరీ పోటీలలో తెలంగాణలోని బిర్లా ఓపెన్ మైండ్స్ ఇంటర్నేషనల్ స్కూల్ ఎల్బీ నగర్, మన్సూరాబాద్ పాఠశాల విద్యార్థులు ఆర్చరీ కోచ్ నూతన్ కుమార్ ఆద్వర్యంలో అద్భుత ఘనత సాధించారు.
అండర్-14 (Under-14) విభాగంలో, 180 మంది విద్యార్థులు పోటీపడగా, బొబ్బలి నాగ మోక్షిత రెడ్డి రజత పథకం మరియు మిక్స్‌డ్ విభాగం లో కె అథర్వా, బొబ్బలి నాగ మోక్షిత రెడ్డి రజత పతకం సాధించారు. అలాగే దీనితో పాటు బొబ్బలి నాగ మోక్షిత రెడ్డి SGF జాతీయ స్థాయి పోటీలకి ఎంపిక అయ్యింది
తెలంగాణ విద్యార్థులైన బొబ్బలి నాగ మోక్షిత రెడ్డి, కె అథర్వ జాతీయ స్థాయి విజయంపై తెలంగాణ ఆర్చరీ అసోసియేషన్ మరియు బిర్లా ఓపెన్ మైండ్స్ ఇంటర్నేషనల్ స్కూల్ ఎల్బీనగర్ మన్సూరాబాద్ పాఠశాల యాజమాన్యం హర్షం వ్యక్తం చేశాయి.
