నల్లమల్లలో భారీ కార్చిచ్చు..

నల్లమల్లలో భారీ కార్చిచ్చు..

  • వన్యప్రాణులకు హాని…
  • నంద్యాల జిల్లా మహానంది సమీపంలో..
  • నల్లమల్ల అడవిలో ఎగిసిపడుతున్న మంటలు..

నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : నంద్యాల జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన మహానంది సమీపంలోని నల్లమల ప్రాంతంలో మంటలు ఒక్కసారిగా చెలరేగాయి. ఈ అడివిలో అగ్ని మంటలు ఎగిసిపడుతుండటంతో అటు వైద్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. ఎవరో ఆకతాయిలు చేసిన పనిగా అటవి శాఖ అధికారులు గుర్తించారు. అసలే వేసవికాలం కావడంతో అడవిలో ఎండిపోయిన ఆకులు గడ్డి నిప్పుకు ఆజ్యం పోశాయి. గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ మంటలు ఒక్కసారిగా చెలరేగాయి. స్థానికులు అప్రమత్తమై అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. వేసవి కాలంలో దాటికి మంటలు అదుపులోకి రాకపోగా మరింత వ్యాపిస్తున్నాయి.

సిగిరెట్ బీడీలు తాగి వేసిన వ్యక్తిలే ఈ ప్రమాదానికి కారణం..
కొద్దిమంది అడవిలోకి వెళ్లి ఎండు కర్రలు వేరుకోవటానికి వెళ్లేవారు. అడవిలోకి వెళ్లిన వ్యక్తులు బీడీలు సిగరెట్లు తాగి ఆర్పి వేయకుండా అడవిలో పడేయడంతో ఈ ప్రమాదం సంభవించవచ్చని అటవీ శాఖ అధికారులు భావిస్తున్నారు. సమాచారం అందుకున్న సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు రంగంలోకి దిగారు. రాత్రి నుంచి అధికారులు మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నట్లు విశాఖ అధికారులు పేర్కొన్నారు. ఫైరింజనుల సహాయంతో కూడా మంటలు ఆర్పుతున్నారు. తీవ్రమైన ఎండలు ఉండటంతో చిన్న నిప్పురవ్వ పెద్ద మంటగా మారుతుంది.

అడవిలోకి వెళ్లేవారు నిప్పుతో కూడిన వస్తువులను తీసుకెళ్లకూడదని అటవీశాఖ అధికారులు జారీ చేసినప్పటికీ ఈ ఆదేశాలు ఎవరూ అమలు కాకపోవటం విశేషం. అసలే వేసవికాలం వన్యప్రాణులు తాగునీటి కోసం గ్రామాల పరిధిలోకి వస్తూ ఉంటాయి. వన్యప్రాణులను కాపాడుకోవటం మనందరి బాధ్యతగా గుర్తించాలని అటవీశాఖ అధికారులు కోరుతున్నారు. సకాలంలో అడవిలోకి వ్యాపించకుండా మంటలను అదుపులోకి తేవడం విశేషం. అటవీ శాఖ సిబ్బంది విచారణ జరుపుతున్నట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు.

శ్రీశైలం కాలినడకన వెళ్లే అటవీ మార్గంలో కూడా గత వారం మంటలు చెలరేగాయి. ఇందులో అటవీశాఖ సిబ్బంది మూడు వాహనాలు కూడా దగ్ధమయ్యాయి. సమయానికి అటవీశాఖ అధికారులు వచ్చి మంటలను అదుపులోకి తెచ్చారు. అటవీశాఖ అధికారులు గ్రామీణ ప్రాంతాల ప్రజలకు అవగాహన కలిగించాల్సిన అవసరం ఉందని అందుకు ప్రతి గ్రామంలోనూ అటవీ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని అధికారులు ఆదేశించారు.

Leave a Reply