Telangana | నేటి విద్యార్థులే రేపటి నవ సమాజ నిర్మాతలు
Telangana | నేటి విద్యార్థులే రేపటి నవ సమాజ నిర్మాతలు
జిల్లా విద్యాశాఖ అధికారి దక్షిణామూర్తి
Telangana | కురవి, ఆంధ్రప్రభ : నేటి విద్యార్థులే రేపటి నవ సమాజ నిర్మాతలని జిల్లా విద్యాశాఖ అధికారి దక్షిణామూర్తి (Dakshinamurthy) అన్నారు. గురువారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మోదుగుల గూడెం నందు పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎం.సత్యనారాయణచారి అధ్యక్షతన పదో తరగతి విద్యార్థినీ విద్యార్థులకు ఆల్ ఇన్ వన్ పుస్తక పంపిణీ కార్యక్రమం జరిగినది.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన జిల్లా విద్యాశాఖ అధికారి (District Education Officer) దక్షిణామూర్తి మాట్లాడుతూ… విద్యార్థుల విద్యాభివృద్ధికి దాత.బొల్లం శ్రీనివాస్ చేసిన సహకారం అభినందనీయమని, దానిని విద్యార్థినీ విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. 10వ తరగతి చదివే విద్యార్థినీ, విద్యార్థులు సమయస్ఫూర్తితో చదివి ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలన్నారు.
జిల్లా సైన్స్ అధికారి అప్పారావు (Apparao) మాట్లాడుతూ… సమయం వృధా చేయకుండా విద్యార్థులకు ఇచ్చిన ఆల్ ఇన్ వన్ పుస్తకాలను పరీక్షల నాటికి రెండు దఫాలుగా రివిజన్ చేయాల్సిన అవసరం ఉందని దాని ద్వారా అత్యధిక మార్కులు సాధించి మంచి ఫలితాలు సాధిస్తారని హితబోధ చేశారు. ఈ కార్యక్రమంలో దాత బొల్లం.శ్రీనివాస్ బలాస్టి రమేష్, మైస శ్రీనివాసులు, చుంచు. శ్రీశైలం, లత, ఇందిరా, దీపిక, రజిత, రచ్చ వెంకన్న, రమేష్, విజయ్ కుమార్, లక్ష్మ, దార్ల సునీల్, వీరయ్య, తదితరులు పాల్గొన్నారు.
