కుండపోత వర్షం..
- నీటిపాలైన జొన్న పంట
రామాయంపేట, ఆంధ్రప్రభ : రామాయంపేటలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురిసింది. దీంతో పట్టణం జలమయమై రోడ్లన్నీ నీట మునిగాయి. వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది. తొలి వర్షం సాగుకు ఎంతో మేలు చేస్తుందని రైతులు, పట్టణ ప్రజలు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అలాగే రామాయంపేటలో మార్కెట్ యార్డులో జొన్నలు వరద నీటికి కొట్టుకుపోయాయి. సకాలంలో జొన్న కొనుగోలు చేయకపోవడంతో, ఆరుగాలం కష్టపడి పండించిన పంట నష్టపోవాల్సి వచ్చింది. కళ్లముందే పంట కొట్టుకుపోతుంటే రైతులు కన్నీరుమున్నీరయారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే తమకు ఈ దుస్థితి పట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు.

