పాండురంగ స్వామి దేవాలయానికి సబ్ మెర్సీబిల్ మోటార్ అందజేసిన గద్దె క్రాంతి కుమార్

పాండురంగ స్వామి దేవాలయానికి సబ్ మెర్సీబిల్ మోటార్ అందజేసిన గద్దె క్రాంతి కుమార్

ఆంధ్రప్రభ పటమట : విజయవాడ 2వ డివిజన్ కుమ్మరి బజార్‌లోని శ్రీ పాండురంగ స్వామి దేవాలయ మండపంలో నెలకొన్న నీటి సమస్యను పరిష్కరించేందుకు స్థానికులు విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామమోహన్ దృష్టికి తీసుకెళ్లారు. సమస్యను వెంటనే గుర్తించిన ఎమ్మెల్యే గద్దె రామమోహన్ సూచనల మేరకు టీడీపీ నాయకుడు గద్దె క్రాంతి కుమార్ రూ.25 వేల విలువైన సబ్ మెర్సీబిల్ మోటార్‌ను సొంత నిధులతో కొనుగోలు చేసి శనివారం నాడు దేవాలయ కమిటీ వారికి ఉచితంగా అందజేశారు. ఈ సందర్బంగా గద్దె క్రాంతి కుమార్ మాట్లాడుతూ దేవాలయానికి వచ్చే భక్తులు, ఆలయ కార్యక్రమాల నిర్వహణలో నీటి కొరత కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ఈ మోటార్ అందజేయడం జరిగిందని గద్దె క్రాంతి కుమార్ తెలిపారు. స్థానిక సమస్యల పరిష్కారానికి ఎప్పుడూ అందుబాటులో ఉంటామని తెలిపారు.

భవిష్యత్తులో కూడా ప్రజా, సామాజిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు తమ వంతు సహకారం కొనసాగుతుందని చెప్పారు. దేవాలయ కమిటీ సభ్యులు సంగెపు రాఘవలు మాట్లాడుతూ సమస్యను పరిష్కరించిన గద్దె రామమోహన్‌, గద్దె క్రాంతి కుమార్‌లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సమస్యను చెప్పిన వెంటనే స్పందించి అవసరమైన సహాయం అందించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ప్రజల సమస్యల పరిష్కారంలో గద్దె రామమోహన్, గద్దె క్రాంతి కుమార్ ఎల్లప్పుడూ ముందుంటారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు దాసరి గాబ్రియేలు, ముత్యాల కృష్ణ, సంగెపు కోటినాగులు, షేక్ షకీలా, గూటాల జేమ్స్, షేక్. హనీఫ్ తదితరులు పాల్గొన్నారు

Leave a Reply