3lakh mark | మళ్లీ పెరిగిన గోల్డ్, సిల్వర్ ధరలు

3lakh mark | మళ్లీ పెరిగిన గోల్డ్, సిల్వర్ ధరలు
3lakh mark | 24 క్యారెట్లు తులం రూ.1,53,980
(ధర రూ.540 పెరిగింది)
22 క్యారెట్లు తులం రూ.1,41,150
(ధర రూ.500 పెరిగింది)
ఒక్కరోజే రూ.15 వేలు పెరిగిన సిల్వర్
3lakh mark | ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : భారత్‌లో బంగారం కొనుగోళ్లు అధికంగా జరుగుతుంటాయి. దేశంలో విపరీతమైన డిమాండ్ ఉంటుంది. ఎక్కువగా మహిళలు బంగారు ఆభరణాలు ధరించడానికి ఇష్టపడుతుంటారు. ధనిక, మధ్య తరగతి కుటుంబాల మహిళలు గోల్డ్ కొనుగోలుకు ఆసక్తి చూపుతుంటారు. పండగలు, వివాహాది శుభకార్యాలకు తప్పని సరిగా గోల్డ్ కొంటుంటారు. ఈ సమయంలో జ్యువెలరీ దుకాణాలు కిటకిటలాడుతుంటాయి. అయితే ఏడాది కాలంగా గోల్డ్ ధరలు పెరుగుతుండటంతో కొనుగోలుదారులు బెంబేలెత్తుతున్నారు.
పసిడి ప్రియులకు షాక్. వరుసగా రెండో రోజు బంగారం ధరలు పెరిగాయి. వెండి ధర అయితే ఏకంగా 15వేలు పెరిగింది. దీంతో కేజీ వెండి ధర రూ. 3 లక్షల మార్కు చేరింది. మరోవైపు.. విదేశీ మారకం తరలిపోకూడదనే ఉద్దేశంతో భారత ప్రధాని నరేంద్ర మోదీ.. ఏడాది పాటు భారతీయుల్ని బంగారం కొనొద్దని పిలుపునిచ్చారు. విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేసేందుకు ఇలా చేయాలని కోరారు. ఇటీవల మే 10న హైదరాబాద్‌లో జరిగిన బీజేపీ సభలో కీలక వ్యాఖ్యలు చేశారు.

హైదరాబాద్ నగరంలో నేడు బంగారం ధరలను ఓ సారి పరిశీలిస్తే.. 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.540 పెరిగి రూ.1,53,980 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర రూ.500 పెరిగి రూ.1,41,150 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారట్ల బంగారం ధర రూ.410 పెరిగి రూ.1,15,490 గా నమోదైంది.
హైదరాబాద్ మార్కెట్లో సిల్వర్ రేటు ఒక్కరోజులోనే రూ. 15 వేలు పెరగడంతో కేజీకి ఇప్పుడు రూ. 3 లక్షల మార్కుకు చేరింది. చాలా రోజుల తర్వాత వెండి ధర రూ. 3 లక్షలకు చేరడం గమనార్హం.
