ప్రభుత్వాసుపత్రిని అకస్మిక తనిఖీ చేసిన మంత్రి….

ప్రభుత్వాసుపత్రిని అకస్మిక తనిఖీ చేసిన మంత్రి….

మచిలీపట్నం – ఆంధ్రప్రభ : మంత్రి కొల్లు రవీంద్ర మచిలీపట్నం ప్రభుత్వాసుపత్రిని మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వైద్య సేవలపై అధికారులకు కొన్ని సూచనలు చేశారు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ఆసుపత్రికి చేరుకున్న మంత్రి, పలు వార్డులను పరిశీలించి రోగులతో నేరుగా మాట్లాడారు. ఆసుపత్రిలో మందుల లభ్యత, శుభ్రత, రోగులకు అందుతున్న సేవలపై మంత్రి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ముఖ్యంగా అత్యవసర విభాగంలో సేవలు పరిశీలించారు.. ఓపి విభాగాన్ని మరింతగా అభివృద్ధి చేయాలని ఆసుపత్రి సూపర్డెంట్ కు చెప్పారు. రోగులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్న మంత్రి, వైద్య సేవల్లో ఎలాంటి నిర్లక్ష్యం వహించవద్దన్నారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడంలో వెనుకాడబోమని స్పష్టం చేశారు. ఈ ఆకస్మిక తనిఖీతో ఆసుపత్రి సిబ్బంది అప్రమత్తమయ్యారు. ప్రభుత్వాసుపత్రుల్లో సేవల నాణ్యతను మెరుగుపరచడమే లక్ష్యంగా ఇటువంటి తనిఖీలు కొనసాగుతాయని మంత్రి తెలిపారు.

Leave a Reply