TG | అనాధ పిల్లలకు అండగా ఉంటా….

TG | అనాధ పిల్లలకు అండగా ఉంటా….

TG | బిక్కనూర్, ఆంధ్రప్రభ : అనాధ పిల్లలకు ఎల్లవేళలా తాను అండగా ఉంటానని మండలంలోని బస్వాపూర్ గ్రామానికి చెందిన ఐదవ వార్డు సభ్యులు ఉదయ్ శర్మ హామీ ఇచ్చారు. గ్రామానికి చెందిన ముద్రకొల్ల మంజుల, బాలరాజ్ ఇటీవల మెదక్ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. దీంతో వారి ఇద్దరు పిల్లలు అనాధలుగా మారారు. విషయం తెలుసుకున్న గ్రామానికి చెందిన రైజింగ్ స్టార్ యూత్ సభ్యులు మృతుల ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం తమ వంతుగా ఐదు వేల రూపాయలతో పాటు నిత్యవసర సరుకులు అందజేశారు. అనంతరం వార్డు సభ్యులు ఉదయ్ శర్మ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలు మృతి చెందడం ఎంతో బాధాకరమని అన్నారు. వారి ఇద్దరు పిల్లలు అనాధలు కావడం వల్ల వారికి తాను ఎల్లవేళలా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో యూత్ సభ్యులు రంజిత్, భరత్, సంపత్, ప్రకాష్, అరుణ్ ,వినయ్, మహేందర్, నితిన్ ,అఖిల్ పాల్గొన్నారు.

Leave a Reply